Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
Bunny Vasu | ప్రియదర్శి కథానాయకుడిగా, ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ డ్రామాను బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ప్రియదర్శి కథానాయకుడిగా, ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ డ్రామాను బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రంలోని ‘ఉల్లిపూల..’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమవుతోందని, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతంతో సినిమా చూసినప్పుడు మరింత బాగా నచ్చిందని చెప్పారు. ఇది సీరియస్ సబ్జెక్ట్ కాదని, తగినంత వినోదం ఉంటుందని అన్నారు. ప్రియదర్శి, నాగదుర్గ పోటీపడి నటించారని, రెండు గంటల 41 నిమిషాల పాటు సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని, థియేటర్ నుంచి అందరూ హ్యాపీగా బయటకు వెళ్తారని గ్యారెంటీ ఇచ్చారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ‘ఉల్లిపూల’ పాటలో ప్రేమలోని ఆనందాన్ని అభినయ శ్రీనివాస్ అద్భుతంగా రాశారని, సురేష్ బొబ్బిలి ప్రతి పాటను చక్కగా స్వరపరిచారని చెప్పారు. త్వరలో మరో పాటను కూడా విడుదల చేస్తామని, సినిమాలో బలమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయని పేర్కొన్నారు.
దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ, సినిమా వర్క్ పూర్తయిందని, బిజీ జీవితంలో మనం కోల్పోతున్న బంధాలను గుర్తుచేసే కథ ఇదని తెలిపారు. రెండు కుటుంబాలు కలిసి చూస్తే బంధం మరింత బలపడుతుందని, భావోద్వేగంతో బయటకు వస్తారని అన్నారు. హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ, ఇప్పటివరకు విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించిందని, డిసెంబర్ 11న మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, కొత్త గొంతు కోసం వెతుకుతున్నప్పుడు హీనా గ్రేస్ పాట విని ఈ పాటలో అవకాశం ఇచ్చానని తెలిపారు. గాయని హీనా గ్రేస్ తనకు తొలి సినిమా పాట అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
లిరిసిస్ట్ అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘గడప’ తరహాలోనే ‘ఉల్లిపూల’ పాట కూడా ఆదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ, సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రధాన బలమని, డిసెంబర్ 11న మంచి సినిమా చూడబోతున్నామని అన్నారు. ప్రియదర్శి, నాగదుర్గ, అభినవ్ గోమటంతో పాటు శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

