కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 13: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం రీకౌంటింగ్కు జనవరి 23 వరకు గడువు ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి లింగాల వెంకటగిరి రాజ్గౌడ్ తెలిపారు.
ఆర్టీసీ డిపోలలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కోరమీసాల ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు దాదాపు మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ
కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.జె.శ్రీలత 2025 సంవత్సరానికిగాను ‘ఇండియా మోస్ట్ ప్రాగమెటిక్ ఉమెన్ లీడర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-2025’ అవార్డుకు ఎన్నికయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పటిష్ట అమలుకు వెంటనే ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి
డిమాండ్ చేశారు.