MLA Naini Rajender Reddy | పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
MLA Naini Rajender Reddy | ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కాలేజీ ప్రధాన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
MLA Naini Rajender Reddy | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: 1955 సంవత్సరంలో దేశ తొలి ప్రధాని నెహ్రూ హయాంలో నిర్మితమై, 70 ఏళ్ల ఘన చరిత్రతో ప్రపంచానికి వేలాది మంది ఇంజనీర్లను అందించిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ రూ.28 కోట్లతో పునర్నిర్మాణ పనుల్లో అధికారులు, గుత్తేదారులు రాజీ పడవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు.
శనివారం ఆయన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కాలేజీ ప్రధాన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా, దీర్ఘకాలం నిలిచేలా నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ర్ట సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రామప్రసాద్, ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు , కాంగ్రెస్ నాయకులు, కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది పి.శ్రీనివాస్, శివకుమార్, పూర్వవిద్యార్థులు బొద్దిరెడ్డి సతీష్‌రెడ్డి, టీ.ఎన్.స్వామి, ప్రకాశ్, సుధాకర్‌రావు, దొడ్డిపల్లి కుమార్, వసంత్‌కుమార్, శశికుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also :
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

