లక్నో: రాపిడోలో బైక్ చేసుకుని దానిపై ప్రయాణించిన ఒక యువకుడిని రైడర్ లైంగికంగా వేధించాడు. అతడి కాలు, తొడను తాకడంతో పాటు ప్రైవేట్ భాగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆ రైడర్ చర్యను ప్రతిఘటించాడు. (Rapido Rider Harassment) అతడు రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌తో రాపిడోకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఆ సంస్థ ఆ రైడర్‌పై చర్యలు తీసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు రాపిడో యాప్‌లో బైక్ బుక్ చేసి దానిపై ప్రయాణించాడు.
కాగా, బైక్ కదులుతుండగా రాపిడో రైడర్ ఆ యువకుడిని లైంగికంగా వేధించాడు. తన చేతిని వెనుకవైపు తీసుకెళ్లి బాలుడి ప్రైవేట్ భాగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతడు అడ్డుకోగా కాలు, తొడపై చేయివేసి తాకేందుకు యత్నించాడు.
మరోవైపు రాపిడో రైడర్ లైంగిక వేధింపులను తన మొబైల్ ఫోన్లో ఆ బాలుడు రికార్డ్ చేశాడు. రాపిడో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఆ వీడియోను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. తాను మైనర్ అని పేర్కొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైడర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో రాపిడో సంస్థ స్పందించింది. ఆ బాలుడి మొబైల్ నంబర్, బైక్ బుకింగ్, రైడర్ ఐడీ వివరాలు సేకరించింది. ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాట్‌ఫారమ్ నుంచి అతడ్ని శాశ్వతంగా నిషేధించినట్లు ఆ యువకుడికి రిప్లై ఇచ్చింది. జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పింది. తన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన రాపిడో సంస్థకు ఆ బాలుడు కూడా ధన్యవాదాలు తెలిపాడు.
Minor Boy Gets Harassed by Rapido Driver During Ride & Posts About It in a Peculiar Gen-Z Way pic.twitter.com/sfyihrXNdS
— Grey Insights (@GI_Bharat) August 14, 2026