Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
Srimathi On ZEE5 | టాలీవుడ్ నటుడు తిరువీర్, నటి నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'శ్రీమతి' (Srimathi). ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ నటుడు తిరువీర్, నటి నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘శ్రీమతి’ (Srimathi). ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో డిసెంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
అయితే ఈ వేడుకలో నటుడు తిరువీర్ మాట్లాడుతూ సినిమా విశేషాలతో పాటు రీమేక్‌పై వస్తున్న ప్రశ్నలకు స్పష్టతనిచ్చారు. “మలయాళంలో ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఇప్పటికే వచ్చింది, తెలుగులో రీమేక్ కూడా అయింది. అయినా మళ్లీ ఇదే కథను తెలుగులో ఎందుకు చేస్తున్నారని నన్ను చాలామంది అడిగారు. ఒక మంచి కథ నచ్చినప్పుడు, దాన్ని మన ప్రాంతానికి, మన నేటివిటీకి తగ్గట్టుగా మలచుకోవడం అనేది కొత్తగా జరుగుతున్న విషయం ఏమీ కాదు. అది నాటకం అయినా, సినిమా అయినా ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. నేను కోవిడ్ సమయంలో ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా చూసినప్పుడు ‘అరె, చాలా బాగా తీశారే’ అని అనుకున్నాను. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మా టీమ్ వాళ్లను కూడా ‘ఆల్రెడీ చాలామంది చూశారు కదా అండి’ అని అడిగాను. దానికి వారు బదులిస్తూ.. ‘ఈ కథను భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు, ఆయా స్థానిక భావోద్వేగాలతో మళ్లీ కొత్తగా చెప్పాలనుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ విజన్ నాకు ఎంతో నచ్చింది” అని తిరువీర్ పేర్కొన్నారు.
అనంతరం ‘శ్రీమతి’ అనే టైటిల్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తిరువీర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘శ్రీమతి’ అనే పదంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. నా కెరీర్లో మొట్టమొదటిసారిగా నేను సినిమా సెట్ చూసింది కన్నడ స్టార్ ఉపేంద్ర గారు నటించిన ‘శ్రీమతి’ సినిమా షూటింగ్‌లోనే. ఆ చిత్రంలో నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. ఆ తర్వాత ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌లో నటించాను. ఇప్పుడు ఏకంగా ‘శ్రీమతి’ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఇలా నా ప్రయాణంలో ఈ టైటిల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. సినిమా చాలా సహజంగా, అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 4వ తేదీ కోసం మీలాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ తిరువీర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ చిత్రంలో రేణు దేశాయ్, విరాజ్ అశ్విన్, హరితేజ, గోపరాజు రమణ, రాజీవ్ కనకాల, ఐశ్వర్య భాస్కరన్, మణిక చిక్కాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈఎల్ విశ్వనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం, డిసెంబర్ 4 నుంచి జీ5 వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

