KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
KTR | రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 82 ప్రకారం సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరుగాలని చెప్పిన మాట కాంగ్రెస్ వద్దంటుందా..? రాజ్యాంగాన్ని రద్దు చేయమంటుందా..? ఏం చేయమని అంటుంది మాకర్థం కావడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఇవాళ కాంగ్రెస్ నేతలు, ఇతరులు ఏం మాట్లాడుతున్నారో మాకర్థం కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు.. అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 82 ప్రకారం సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరుగాలని చెప్పిన మాట కాంగ్రెస్ వద్దంటుందా..? రాజ్యాంగాన్ని రద్దు చేయమంటుందా..? లేదా మరి 24 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించాలని కోరుతుందా.. 19 శాతం చేయమంటుందా..? ఏం చేయమని అంటుంది మాకర్థం కావడం లేదన్నారు.
కాదు నియోజకవర్గాల పునర్విభజనను బీజేపీ ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తదని అనుమానముంటే డీలిమిటేషన్ కమిషన్ ఉంటది.. అందులో అందరికీ ప్రాతినిధ్యం ఉంటది.. పారదర్శకంగా చేయాలని అందరం డిమాండ్ చేద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్. మనకు అనుమానాలుంటే గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం.. తర్వాత న్యాయవ్యవస్థ ఉంది.. అవన్నీ ఉన్నయి కాబట్టి అనవసరంగా లేనిపోనివి చేయకుండా సమర్థిస్తే అందరికీ మంచిదన్నారు.
కేంద్రంలో కూడా మన ప్రాతినిథ్యం..
ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరముంది.. 2014లో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతామని పార్లమెంట్లో చట్టం పాసైంది.. కానీ గత 12-13 ఏండ్లుగా బీజేపీ దాన్ని అమలు చేయలేదు.. ఇవాళ తెలంగాణకు రాజకీయ సుస్థిరత వస్తున్నది.. 119 నుంచి 60 సీట్లు పెరిగి 180 సీట్లకు వస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ సుస్థిరత వస్తది.. తెలంగాణ ఒక రాష్ట్రంగా విజయవంతంగా ముందుకు పోయేందుకు అవకాశముంటదన్నారు. కాబట్టి పెరిగే లోక్ సభ సీట్లు మనకు రేపటికి పనికొస్తాయి.. 26 సీట్లు వస్తే రేపు కేంద్రంలో కూడా మన ప్రాతినిథ్యం పెరుగుతది.. మన గొంతు పెరుగుతది.. అందుకే ఈ బిల్లుకు మేం సమర్థిస్తున్నామని కేటీఆర్ స్పస్టం చేశారు.
వ్యతిరేకించేవాళ్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని అడుగుతున్నానన్నారు కేటీఆర్. ఏ కారణంచేత ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. ఇది ఖచ్చితగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల విజయం,. ఇది తెలంగాణ విజయం.. ఇది బీఆర్ ఎస్ విజయంగా మేమైతే భావిస్తున్నామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారి డీలిమిటేషన్ అనేది జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ప్రపోర్షన్ (1971 డిసైడ్ అయిన ) ఆధారంగా మెయింటైన్ చేస్తామని చెప్పడం మన విజయంగా, ఘన విజయంగా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
LIVE: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/dr9LjxPUz0
— BRS Party (@BRSparty) November 29, 2026
Read Also :
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

