ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Woman, Lover Kills Mother-In-Law | రాత్రి వేళ గదిలో ప్రియుడితో కలిసి కోడలు ఉండటాన్ని అత్త చూసింది. అభ్యంతరకర స్థితిలో ఉన్న వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఈ నేపథ్యంలో కోడలు, ఆమె ప్రియుడు కలిసి లావైన కర్రతో కొట్టి వృద్ధురాలైన అత్తను హత్య చేశారు. భూ వివాదం ఉన్న పొరుగువారిపై హత్యా నేరాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు.
పాట్నా: రాత్రి వేళ గదిలో ప్రియుడితో కలిసి కోడలు ఉండటాన్ని అత్త చూసింది. అభ్యంతరకర స్థితిలో ఉన్న వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఈ నేపథ్యంలో కోడలు, ఆమె ప్రియుడు కలిసి లావైన కర్రతో కొట్టి వృద్ధురాలైన అత్తను హత్య చేశారు. భూ వివాదం ఉన్న పొరుగువారిపై హత్యా నేరాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు. (Woman, Lover Kills Mother-In-Law) దర్యాప్తు చేసిన పోలీసులు కోడలు, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నయా నందగోల గ్రామానికి చెందిన 69 ఏళ్ల రామ్లా దేవి, నవంబర్ 25న తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోడలైన గుడ్డి కుమారి గదిలోకి వెళ్లింది. ప్రియుడు రిషి కుమార్‌తో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఆమెను పట్టుకున్నది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి చెక్క మొద్దుతో తలపై కొట్టి రామ్లా దేవిని హత్య చేశారు. పొరుగున నివసించే కుటుంబంపైకి ఈ నేరాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు.
కాగా, తమ కుటుంబాల మధ్య ఉన్న భూ వివాదం కారణంగా పొరుగున నివసించే నితీష్ కుమార్, అతడి తల్లి కలిసి తన తల్లిని హత్య చేసినట్లు రామ్లా దేవి కుమారుడు అబోధ్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మొదట పొరుగువారిని అనుమానించి వారిని అరెస్ట్ చేశారు.
మరోవైపు వృద్ధురాలి హత్యపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. దీంతో రామ్లా దేవి కోడలైన గుడ్డి కుమారి, ప్రియుడు రిషి కుమార్ మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని పోలీసులు విచారించారు.
చివరకు తామే హత్య చేసినట్లుగా గుడ్డి కుమారి, ఆమె ప్రియుడు రిషి కుమార్ అంగీకరించారని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులైన వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యకు వినియోగించిన చెక్క దుంగను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Catches Them
- Kills
- Lover
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

