Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Ramesh Babu Cherukuru | మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు.
మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు. నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు నుంచే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, “మా సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో వీక్షించాను. అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా కథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా పాటలకు థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. దర్శకుడిగా ఇది నా మొదటి కల సినిమా. ఇంతటి ఘనవిజయాన్ని అందించి నా కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటం గొప్ప విజయంగా భావిస్తున్నాను” అని అన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ, “మేము ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు తగిన ఫలితాన్నిస్తూ పెద్ద హిట్ చేశారు. నిజానికి మేము ఇంతటి భారీ రెస్పాన్స్‌ను ఊహించలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ‘సిద్ధు’ పాత్రకు యువత బాగా కనెక్ట్ అవుతోంది. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేశానని అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తోంది. ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది, రాబోయే షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతాయని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రమిది” అని పేర్కొన్నారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ, “మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సెంటర్ నుంచి మా చిత్రానికి హిట్ టాక్ వినిపిస్తోంది. ఇది యూత్ ఓరియెంటెడ్ కథ అయినప్పటికీ, కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ తమ ఫ్యామిలీతో కలిసి మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రచయిత శ్రీధర్ మాట్లాడుతూ, “నైజాం, సీడెడ్, ఆంధ్రా ఇలా అన్ని ప్రాంతాల నుంచి ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’కి హిట్ టాక్ రావడం ఆనందంగా ఉంది. పాటలతో పాటు హీరో హీరోయిన్ల పాత్రలను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. మా చిత్రానికి ఇలాగే మరింత విజయాన్ని అందించాలని కోరుతున్నాము” అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై.వి. రావు మాట్లాడుతూ, ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన సినీ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
సీనియర్ నటుడు సుమన్, సర్కార్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దొసాడ యాదగిరి సినిమాటోగ్రఫీ అందించారు. సి.ఎన్. ఆదిత్య సంగీతం సమకూర్చగా, లక్కీ ఎక్కరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తూఫాన్ ఫైట్స్, నాని ఆర్ట్ డైరెక్షన్, రమేష్ బాబు చెరుకూరు మరియు రజని సాగర్ కొరియోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి వి. సాంబశివరావు, వేణుగోపాల చారి చెరుకూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

