Woman Tries to Kill Husband | భర్తకు మత్తుమందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టి పాతిపెట్టేందుకు యత్నించిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Tries to Kill Husband | ఒక మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అతడికి మత్తు మందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టింది. ఇంట్లోనే గోతి లాంటి నిర్మాణంలో పాతిపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే కూలీలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
ముంబై: ఒక మహిళ తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అతడికి మత్తు మందు ఇచ్చి బ్యాట్‌తో కొట్టింది. ఇంట్లోనే గోతి లాంటి నిర్మాణంలో పాతిపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే కూలీలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. (Woman Tries to Kill Husband) క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమా నుంచి ప్రేరణ పొందినట్లుగా అనిపించిన ఈ సంఘటన మహారాష్ట్రలోని బారామతిలో జరిగింది. 38 ఏళ్ల షర్మిల తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. జూలై 30న భర్త తాగిన జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపింది. దీంతో అతడు రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు.
కాగా, ఆగస్ట్ 1న ప్రవీణ్ పాక్షికంగా స్పృహలోకి వచ్చాడు. గమనించిన భార్య షర్మిల బ్యాట్‌తో అతడ్ని తీవ్రంగా కొట్టడంతో తిరిగి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కూలీల సహాయంతో బాల్కనీలో ఇటుకలు, సిమెంట్‌తో గుంత లాంటి నిర్మాణాన్ని కట్టించింది. స్పృహలో లేని భర్త ప్రవీణ్‌ను అందులో పడేసింది. స్లాబ్ రాయితో కప్పి దానిని మూసేందుకు ప్రయత్నించింది. అయితే అనుమానించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని ప్రవీణ్‌ను రక్షించారు. షర్మిలను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఇంట్లో ఉన్న తన తల్లికి కూడా తన భార్య నిద్ర మాత్రలు ఇచ్చిందని ప్రవీణ్ ఆరోపించాడు. భార్య తనను బ్యాట్‌తో కొడుతున్నప్పుడు తన తల్లికి స్పృహ రావడంతో ఇది చూసి తన తమ్ముడికి సమాచారం ఇచ్చిందని చెప్పాడు. తన తమ్ముడు వెంటనే ఇంటికి చేరుకున్నాడని, గుంతలో ఉన్న తనను చూసి వెంటనే పైకి తీసి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రవీణ్ వివరించాడు.
అయితే భార్య తనను చంపేందుకు ప్రయత్నించడం వెనుక చేతబడి లేదా క్షుద్రపూజల కోణం ఉండవచ్చని ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశాడు. అమావాస్య గడియలైన జూలై 13, 14 తేదీల్లో క్యాలెండర్‌పై ‘ఫలితం లేదు’ అని ఆమె రాసినట్లు తెలిపాడు.
కాగా, అత్తమామల వద్ద ఉన్న తన ఇద్దరు పిల్లలకు కూడా ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని తన పిల్లలను తనకు అప్పగించాలని కోరాడు. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తన భార్యకు నిద్రమాత్రలు విక్రయించిన మెడికల్ స్టోర్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ మెడికల్ షాప్ లైసెన్స్‌ను రద్దు చేయాలని అతడు డిమాండ్ చేశాడు.
बारामती में खौफनाक साजिश! 😱
आरोप है कि महिला ने पति को नशीली दवा देकर बेहोश किया, मारपीट की और बालकनी में बने गड्ढे में जिंदा दफन करने की तैयारी कर ली। ऊपर से पत्थर की फरशी लगाने से पहले मजदूरों को शक हुआ और पुलिस को सूचना दे दी—जिससे पति की जान बच गई।
मामले की पूरी सच्चाई जांच… pic.twitter.com/4RP9C3aoUR— Sahodar – Equality For Men (@SahodarIndia) August 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

