Swami Ramdev | పతంజలి నెయ్యిలో కల్తీ లేదు.. మందులపై నిషేధం అబద్ధం.. స్వామి రామ్‌దేవ్
Swami Ramdev : పతంజలి నెయ్యి కల్తీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై స్వామి రామ్‌దేవ్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు. తమ సంస్థ తయారు చేసే ఔషధాల్ని నిషేధించారు అంటూ జరుగుతున్న ప్రచారం కూడా అబద్ధం అన్నారు.
Swami Ramdev : పతంజలి నెయ్యి కల్తీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై స్వామి రామ్‌దేవ్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు. అలాగే, తమ సంస్థ తయారు చేసే ఔషధాల్ని నిషేధించారు అంటూ జరుగుతున్న ప్రచారం కూడా అబద్ధం అన్నారు. ఇటీవల పతంజలి సంస్థ ఉత్పత్తులపై జరుగుతున్న ప్రచారంపై స్వామి రామ్‌దేవ్ స్పందించారు. ఈ అంశంపై బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ తయారు చేస్తున్న ఔషధాన్ని సుప్రీంకోర్టు నిషేధించలేదని స్పష్టం చేశారు.
పతంజలి రూపొందించే ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అలాగే, ఇండియాలోని, విదేశాల్లోని అన్ని సంస్థల ప్రమాణాలకు మించి ఉన్నాయని వివరించారు. పతంజలి నెయ్యిలో కూడా ఎలాంటి కల్తీ లేదని, అవసరమనుకుంటే దేశంలోని ఏ ల్యాబ్‌లో అయినా పరీక్షించుకోవచ్చన్నారు. ముఖ్యంగా పతంజలి నెయ్యిలో జంతువుల కొవ్వు, ఎముకల పొడి కలిసిందనే ప్రచారంలో కూడా నిజం లేదన్నారు. కొంతకాలంగా పతంజలి ఉత్పత్తులపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. మరోవైపు పతంజలి ఉత్పత్తులపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ చేసిన ఆరోపణలపై కూడా రామ్‌దేవ్ స్పందించారు.
ఆయనకు ఈ అంశంపై అవగాహన లేదని, అందరూ చేస్తున్న దుష్ప్రచారం, వదంతుల్ని నమ్మి ఆయన వ్యాఖ్యలు చేశారని రామ్‌దేవ్ వివరించారు. ఈ విషయంలో అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చామన్నారు. అలాగే, ఆయనపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును కూడా పతంజలి సంస్థ ఉపసంహరించుకుందని తెలిపారు. డ్రగ్ అండ్ రెమెడీ యాక్ట్ గురించి రామ్‌దేవ్ స్పందిస్తూ.. ఈ చట్టం పాతకాలం నాటిదని, ఈ చట్టాన్ని మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

