Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Governor Shiv Pratap Shukla | విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
హనుమకొండ చౌరస్తా : విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు ( Universities ) కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా ( Governor Shiv Pratap Shukla) పిలుపునిచ్చారు.
శనివారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం ( Graduation Ceremony) లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. విద్య కేవలం డిగ్రీలు పొందేందుకు మాత్రమే కాకుండా, సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దేందుకు దోహదపడాలని సూచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం 50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని, స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ స్నాతకోత్సవం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని గవర్నర్ అన్నారు.

1976 ఆగస్టు 19న స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందిస్తూ, అనేక కుటుంబాల్లో తొలి తరం పట్టభద్రులను తయారు చేసిందన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ, నాయకత్వ అవకాశాలను విస్తరించడంలోనూ విశ్వవిద్యాలయం విశేష పాత్ర పోషించిందని కొనియాడారు. కేయూ 2023లో న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమని గవర్నర్ అన్నారు.
యువత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్నాతకోత్సవ సందేశం ఇచ్చారు. లర్న్, బిల్ట్ అండ్ లీడ్ నినాదంతో ముందుకు సాగాలని పట్టభద్రులకు సూచించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి కేయూ చేపట్టిన విద్యాసంబంధిత కార్యక్రమాలు, పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు గవర్నర్ డిగ్రీలను ప్రదానం చేశారు.
అంతకు ముందు హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ శ్వేత, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు.అనంత రం నిట్ వీఐపీ గెస్ట్ హౌస్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

