CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
CJP Oppose Delimitation Bill | పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విజ్ఞప్తి చేసింది. ఆ బిల్లు ఆమోదానికి ఏ పార్టీ లేదా రాజకీయ నాయకుడైనా సహకరించడం ‘ప్రజల తీర్పుకు ఘోర ద్రోహం’ చేసినట్లేనని పేర్కొంది.
న్యూఢిల్లీ: పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విజ్ఞప్తి చేసింది. ఆ బిల్లు ఆమోదానికి ఏ పార్టీ లేదా రాజకీయ నాయకుడైనా సహకరించడం ‘ప్రజల తీర్పుకు ఘోర ద్రోహం’ చేసినట్లేనని పేర్కొంది. (CJP Oppose Delimitation Bill) శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిపాదిత ప్రక్రియలో అత్యంత హానికరమైన అంశం ఉన్నదని సీజేపీ తెలిపింది. అధికార పార్టీకి స్పష్టమైన ప్రయోజనం చేకూర్చేలా పార్లమెంటరీ, విధానసభ నియోజకవర్గాల సరిహద్దులను పక్షపాత ధోరణితో మార్చడాన్ని ‘జెర్రీమాండరింగ్’ అని పిలుస్తారని పేర్కొంది. భారతదేశ ఎన్నికల చిత్రపటాన్ని ‘తారుమారు’ చేసే ఈ చర్యకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలువాలని పిలుపునిచ్చింది.
కాగా, ఓటర్లను కొన్ని నియోజకవర్గాల్లో కేంద్రీకరించి, మిగతా వాటిలో విభజించడం ద్వారా, పోలైన మొత్తం ఓట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకపోయినా రాజకీయ ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. తగిన రక్షణలు, స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనను శాశ్వత ఎన్నికల ప్రయోజనం చేకూర్చేందుకు బీజేపీకి ఉపయోగించుకోవచ్చని తాము ‘తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘ప్రజాస్వామ్య విలువల పట్ల ద్రోహపూరితంగా వ్యవహరిస్తూ, ‘సర్’ ప్రక్రియలో ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భాగస్వామ్యంతో కూడిన డీలిమిటేషన్ కమిషన్ (నియోజకవర్గాల పునర్విభజన కమిషన్) పట్ల ఎవరికీ ఎలాంటి నమ్మకం కలగదు’ అని స్పష్టం చేసింది.
మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు ఎలాంటి అవగాహన లేకుండా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయని, దీనివల్ల దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరుగుతుందని వాదిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయని సీజేపీ నాయకుడు అశుతోష్ రాంకా తెలిపారు. ‘తాము ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (జెర్రీమాండరింగ్)కు మద్దతు ఇస్తున్నారో వారికి ఏమాత్రం అవగాహన లేదు. దీనికి ఉదాహరణగా అస్సాంలోని ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను పరిశీలించండి’ అని ఆయన సూచించారు.
కాగా, బీజేపీకి, మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే దాని దుష్ట పథకాలకు మేలు చేకూర్చేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తే, అది ప్రజలకు చేసే ఘోర ద్రోహం అవుతుందని సీజేపీకి చెందిన మరో నేత సౌరవ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ అనైతిక, సూత్రాలు లేని రాజకీయాల మూల్యాన్ని యువత చెల్లించాల్సి వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌కు తమ మద్దతును సీజేపీ పునరుద్ఘాటించింది. ‘మహిళా రిజర్వేషన్‌ను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించినప్పటికీ, అది ఇంకా అమలు కాలేదు. ఎన్నికల సరిహద్దులను తారుమారు చేయడానికి దీనిని ఒక ముసుగుగా ఉపయోగించడం, భారతదేశ నియోజకవర్గాల పక్షపాత పునర్విభజన అనే అసలు సమస్య నుంచి దృష్టిని మరల్చడానికి చేస్తున్న ఒక నీచమైన ప్రయత్నం’ అని విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- benefit
- BJP
- CJP
- Delimitation Bill
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

