BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలను తక్షణమే సరిదిద్దాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఓటర్ల ( Graduate Electoral ) జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలను తక్షణమే సరిదిద్దాలని బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. అర్హులైన ఓటర్లకు సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో పాటు, ఫొటోల తప్పిదాలు, డూప్లికేట్ ఓట్లు, అనుమానాస్పద ఓటర్ల నమోదుపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరింది.
శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ ( Soma Bharat Kumar ) ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవిప్రసాద్ ,పల్లె రవికుమార్ , టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు.
15–16 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాల కేటాయింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాల పరిశీలనలో రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని, ఈఆర్ఓలు, కలెక్టర్లు, ఆర్డీవోలకు తప్పిదాలను తెలియజేయాలని సోమ భరత్‌కుమార్ కోరారు. ఓటర్ల జాబితాలో ఫొటోలకు బదులుగా డిగ్రీ సర్టిఫికెట్లు పొందుపరచడం వంటి అనేక తప్పిదాలు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు.
ఈ అవకతవకలు ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓలు) చేసినవా? లేక ప్రైవేటు వ్యక్తులు వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టిన క్రమంలో చోటుచేసుకున్నాయా? అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. రెండు నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలని, అదే సమయం లో అనర్హులు, నకిలీ ఓట్లు జాబితాలో ఉండకుండా చూడాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

