Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Horrific incident | ఓ కసాయి తల్లి ముగ్గురు ఆడ పిల్లలను సంపులో పడేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దారుణ ఘటన రంగారెడ్డిలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి : ఓ కసాయి తల్లి ముగ్గురు ఆడ పిల్లలను ( Three daughters ) సంపులో పడేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ దారుణ ఘటన ( Horrific incident) రంగారెడ్డిలో చోటు చేసుకుంది. షాద్ నగర్ ( Shadnagar ) నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో జరిగిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతులకు ముగ్గురు ఆరేళ్ల లోపు ఆడపిల్లలున్నారు.

ఏమైందో ఏమో కాని శుక్రవారం ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్న నీటి సంపులో దూకింది. దీంతో ముగ్గురు కూతుళ్లు మృతి చెందగా తల్లి ప్రాణాలతో బయట పడింది. ఆ సమయంలో భర్త పనికి వెళ్లడంతో చరవాణి ద్వారా సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించాడు. గత నాలుగైదు రోజులుగా తమ మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదని వాపోయాడు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

