Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కాకముందు తెలంగాణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో బతుకుదెరువు కోసం వలసలు వెళ్లేవారని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. పట్టణాలకు పోయి కూలీలుగా మారారని నాటి పరిస్థితులను నెమరు వేసుకున్నారు.
Harish Rao : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కాకముందు తెలంగాణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో బతుకుదెరువు కోసం వలసలు వెళ్లేవారని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. పట్టణాలకు పోయి కూలీలుగా మారారని నాటి పరిస్థితులను నెమరు వేసుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో ఒకపోస్టు పెట్టారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఇక్కడి పేదలకు బతుకుదెరువు కరువైందని తెలిపారు.
దాంతో ఎన్నో కుటుంబాల మగవాళ్లు.. తమ భార్యా, బిడ్డలను, కన్న తల్లిదండ్రులను వదిలి ముంబైకి, దుబాయ్‌కి వలసలు పోయారని గుర్తుచేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం కాగానే వలసలు తిరుగుముఖం పట్టాయని తెలిపారు. కేసీఆర్ సుభిక్ష పాలనతో రాష్ట్రం సస్యశ్యామలమైందని, దాంతో వలసలు వెళ్లిన ప్రజలు సొంతూళ్లకు చేరి ఉపాధి పొందారని వెల్లడించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనతో పరిస్థితులు మళ్లీ తారుమారవుతున్నాయని తెలిపారు.
ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు మొదలయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎడ్లబండ్లు కట్టుకుని కుటుంబాలకు కుటుంబాలే వలసపోతున్న ఘటనకు సంబంధించిన ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

