Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
Man Kills Girlfriend | నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఒక జంట ఉద్యోగం కోసం ఒక నగరానికి చేరుకున్నారు. ఒక లాడ్జిలో వారు బస చేశారు. అయితే ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు అనుమానించాడు. ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆ యువతిని అతడు హత్య చేశాడు.
బెంగళూరు: నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఒక జంట ఉద్యోగం కోసం ఒక నగరానికి చేరుకున్నారు. ఒక లాడ్జిలో వారు బస చేశారు. అయితే ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు అనుమానించాడు. ఈ విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆ యువతిని అతడు హత్య చేశాడు. (Man Kills Girlfriend) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కేరళకు చెందిన 22 ఏళ్ల గంగ, 23 ఏళ్ల గోకుల్ కృష్ణ కలిసి ఒకే కాలేజీలో నర్సింగ్ విద్యను పూర్తి చేశారు. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
కాగా, గంగ, గోకుల్ కృష్ణ కలిసి జాబ్ కోసం బెంగళూరు చేరుకున్నారు. నవంబర్ 26న కాటన్‌పేట ప్రాంతంలోని ఒక లాడ్జిలో వారు బస చేశారు. అయితే గంగకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు గోకుల్ అనుమానించాడు. లాడ్జిలో బస చేసిన ఈ జంట మధ్య ఈ విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గోకుల్ కృష్ణ కత్తితో గంగను పొడిచి హత్య చేశాడు.
మరోవైపు శుక్రవారం ఉదయం ఆ జంట బస చేసిన రూమ్ సమీపంలోని మెట్ల వద్ద రక్తపు మరకలను లాడ్జి సిబ్బంది గమనించారు. ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. రూమ్ లోపల రక్తం మడుగులో పడి ఉన్న గంగను గమనించారు. సమీపంలోని ఆసుపత్రికి ఆమె తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో గోకుల్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

