RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ఉన్నది 300 ఎకరాలు అయితే మొత్తం 500 ఎకరాలు ఉన్నట్లు అధికారులు రికార్డులు సృష్టించి రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెసోళ్లు దాదాపు రూ.60 కోట్ల కుంభకోణం చేశారన్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
RS Praveen Kumar | కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకీంపేటలో కాంగ్రెసోళ్లు అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర లేపారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల సోదరులకు సంబంధించిన భూమిని ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఒక ఫార్మాసిటీ పెడతామని దాదాపు 200-400 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్న ఉదంతం అందరికీ తెలుసు.. దాంట్లో నరేందర్ రెడ్డి 42 రోజులు జైలులో కూడా ఉన్నారు.. ఆయన జైలులో ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి చెప్పని స్టేట్మెంట్ కూడా పోలీసోళ్లు రికార్డు చేసి కోర్టుకు సమర్పిస్తే.. మళ్లీ వారికి ఈ విషయం తెలిసి జైలు నుంచే తాను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదని కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఓ గ్రోత్ కారిడార్ పేరు మీద కొడంగల్‌లో కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడం కోసం కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకీంపేటలో కాంగ్రెసోళ్లు అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర లేపారన్నారు.
అక్కడున్నది 300 ఎకరాలు అయితే మొత్తం 500 ఎకరాలు ఉన్నట్లు అధికారులు రికార్డులు సృష్టించి రేవంత్ రెడ్డి సహకారంతో దాదాపు రూ.60 కోట్ల కుంభకోణం చేశారన్నారు. ఎంత ఘోరమైన స్కాం అంటే అసైన్డ్ భూములు.. ఒక వ్యక్తికి ఒక సర్వే నంబర్ 252-10లో ఆయనకు కేవలం మూడెకరాలు మాత్రమే ఉంటది.. కానీ అందులో ఇంకో బై నంబర్ సృష్టించి.. దాదాపు 32 బై నంబర్లు సృష్టించి 70 ఎకరాలున్నట్టు చూపించారు. ఈ 70 ఎకరాలకు దాదాపు 32 మంది రైతులున్నారు.. ఈ 32 మంది రైతులకు ఒక్కొక్కరికి ఎకరానికి రూ.25 లక్షల చొప్పున అందించారు. ఒక్క చిన్న ఉదాహరణ.. అట్లా సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం మేరకు ఇందులో రూ.60 కోట్ల స్కాం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర లేపారు
ఉన్నది 300 ఎకరాలు అయితే, 500 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు
రేవంత్ రెడ్డి సహకారంతో దాదాపు రూ.60 కోట్ల కుంభకోణం చేశారు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
డీజీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, ఆయన సమయం ఇవ్వడం లేదు
దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
లగచర్లలో ఎలాగైతే పోరాడి గిరిజనులకు న్యాయం చేశామో, హకీంపేట భూ కుంభకోణంపై కూడా పోరాటం చేస్తాము
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2026
Read Also :
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడూ స్పష్టమే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

