Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
Mohabbat | సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మొహబ్బత్'. అఫ్రోజ్ షేక్ నిర్మాణంలో, మ్యాక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Mohabbat | సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మొహబ్బత్’. అఫ్రోజ్ షేక్ నిర్మాణంలో, మ్యాక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ‘వరమే’ అంటూ సాగే ఓ అందమైన ప్రేమ గీతాన్ని ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసింది.
సునీల్ కశ్యప్ క్యాచీ బాణీలు సమకూర్చిన ఈ పాటకు భాష్య శ్రీ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా, కృష్ణ తేజస్వి తన గాత్రంతో ప్రాణం పోశారు. యూత్ ఆడియెన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ లిరికల్ వీడియోలో మొయిన్ అందించిన కొరియోగ్రఫీ, సింపుల్ స్టెప్స్‌తో కథను నడిపించిన తీరు ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్లతో పాటు ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సలీమ్ షేక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వైఎస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, కలాం రచయితగా, శ్రీ వర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
Mayawati | ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి: మాయావతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

