Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Nani | టాలీవుడ్లో సహజమైన నటనతో ‘నేచురల్ స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన నాని.. గత కొంతకాలంగా తన సినిమాల ఎంపికలో కొత్త పంథాను అనుసరిస్తున్నారు.
Nani | టాలీవుడ్లో సహజమైన నటనతో ‘నేచురల్ స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన నాని.. గత కొంతకాలంగా తన సినిమాల ఎంపికలో కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ‘దసరా’ సినిమాతో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన, ఆ తర్వాత ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి చిత్రాలతో మరింత రా అండ్ రస్టిక్ పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు మళ్లీ తన పాత ఇమేజ్‌కు దగ్గరయ్యేలా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నాని కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా ప్రేమకథలు, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన సినిమాలు చేస్తూ వచ్చారు. ‘అలా మొదలైంది’, ‘భలే భలే మగాడివోయ్’, ‘జెర్సీ’, ‘నిన్ను కోరి’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ‘దసరా’ విజయంతో మాస్ సినిమాలపై ఆసక్తి పెంచుకున్న నాని.. వరుసగా యాక్షన్ ప్రధానమైన కథలను ఎంచుకున్నారు. ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాల్లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండే పాత్రల్లో కనిపించారు. కానీ ఇలాంటి కథలు తనను ఇష్టపడే కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చకపోవచ్చనే అభిప్రాయం నానిలో కలిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి తన సినిమాలను చూడాలనే ఉద్దేశంతో ఇకపై కొంతకాలం హింసాత్మక యాక్షన్ చిత్రాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. తాను ఎక్కడికి వెళ్లినా ముందుగా చిన్నపిల్లలే తన దగ్గరకు వస్తుంటారని, వారితో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి తన సినిమాలను చూసేలా కథలను ఎంచుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకే ఇకపై క్లీన్ ఎంటర్టైనర్స్, భావోద్వేగాలతో కూడిన కథలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమాలో నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ అంశాలు ఉన్నప్పటికీ, ‘ది ప్యారడైజ్’ తరహాలో కాకుండా స్టైలిష్‌గా, వినోదాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓ అందమైన, సున్నితమైన ప్రేమకథలో నటించబోతున్నట్లు కూడా నాని వెల్లడించినట్లు సమాచారం.
నాని తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తమిళంలో ‘96’, ‘సత్యం సుందరం’ వంటి భావోద్వేగభరితమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పిన ఓ కథ నానికి బాగా నచ్చిందని, ఈ ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నానికి ‘నిన్ను కోరి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు శివ నిర్వాణతో మరోసారి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. సినిమాల ఎంపికతో పాటు షూటింగ్ షెడ్యూల్స్ విషయంలోనూ నాని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం దాదాపు రెండేళ్ల సమయం కేటాయించిన నేపథ్యంలో, ఇకపై ఎక్కువ కాలం షూటింగ్‌లకు పరిమితం కాకుండా తక్కువ వ్యవధిలో పూర్తయ్యే కథలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

