RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే మీకు అసైన్డ్ భూమి లేకపోయినా.. అధికారులు మీకు అసైన్డ్ భూమి ఉన్నట్టు రికార్డులు సృష్టించి నష్టపరిహారం మీకిచ్చేస్తరని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
RS Praveen Kumar | మీరు ఒకవేళ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడైతే.. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఉంటే మీరు ఎన్ని రికార్డులు అయినా సృష్టించొచ్చు. రికార్డులు లేకుండా కూడా మీరు భూముల్లో నష్టపరిహారం తీసుకోవచ్చు. మీకు అసైన్డ్ భూమి లేకపోయినా.. మీకు అసైన్డ్ భూమి ఉన్నట్టు రికార్డులు సృష్టించి మీకిచ్చేస్తరని
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల కుంభకోణంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నిజానికి ప్రజా ప్రాజెక్టుల కోసం ఒక భూమిని సేకరించాలంటే ముందు జిల్లా కలెక్టర్ ఒక నోటిఫికేషన్ ఇస్తరు.. తర్వాత దానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు.. ఆయన ల్యాండ్ అక్విజేషన్ అథారిటీ.. ఈయన ఎమ్మార్వోలకు లేదా తహసీల్దార్లకు ఆదేశాలిస్తారు.. ఆర్డర్లు ఇచ్చిన తర్వాత వీళ్లు మోఖా మీదికి పోతారు.. మోఖా మీదికి పోయినంక అక్కడి నుంచి భూమి రికార్డులన్నీ సేకరిస్తారు.. మోఖా మీద ఎవరున్నారు.. రికార్డులు ఎవరి పేరు మీదున్నవనేది బేరీజు వేసి.. వీళ్లకు హద్దులు నిర్ణయించి ఆ మేరకు భూమంతా సేకరించి వాళ్లకు నష్టపరిహారం ఇస్తారు.. ఇక్కడ అలాంటివేమీ జరుగలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెసోళ్ల జేబులు నింపమన్నరు.. వందల కోట్ల రూపాయలు కాంగ్రేసోళ్ల జేబుల్లొకి పోయినయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . అక్కడ పరిశ్రమలు వస్తయా.. రావా అనేది దేవుడికి తెలుసున్నారు. మళ్లీ దాంట్లోనే కాంగ్రెసోళ్లు వెంచర్లు వేసుకున్నారు.. దీనిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. డీజీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, ఆయన సమయం ఇవ్వడం లేదు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లగచర్లలో ఎలాగైతే పోరాడి గిరిజనులకు న్యాయం చేశామో, హకీంపేట భూ కుంభకోణంపై కూడా పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో అసైన్డ్ భూముల కుంభకోణానికి తెర లేపారు
ఉన్నది 300 ఎకరాలు అయితే, 500 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు
రేవంత్ రెడ్డి సహకారంతో దాదాపు రూ.60 కోట్ల కుంభకోణం చేశారు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
డీజీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, ఆయన సమయం ఇవ్వడం లేదు
దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
లగచర్లలో ఎలాగైతే పోరాడి గిరిజనులకు న్యాయం చేశామో, హకీంపేట భూ కుంభకోణంపై కూడా పోరాటం చేస్తాము
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2026
Read Also :
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

