Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
Rasamayi Balakishan | 2009 నవంబర్ 29న పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తలచుకోవడం అంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని తలచుకోవడమేనని బీఆరెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రేపు కరీంనగర్‌లోని దీక్షా దివస్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
Rasamayi Balakishan : 2009 నవంబర్ 29న పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తలచుకోవడం అంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని తలచుకోవడమేనని బీఆరెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రేపు కరీంనగర్‌లోని దీక్షా దివస్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్ష ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా అప్పుడు గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఎంతటి ప్రాముఖ్యత కలిగినదో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కూడా అంతే చారిత్రక ప్రాముఖ్యతను కలిగినదని రసమయి అన్నారు. అలుగునూరులో కేసీఆర్ వేసిన మొదటి అడుగు తెలంగాణ ఉద్యమంలోనే ఒక కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు.
క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం మాదిరిగానే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కూడా మన రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక శకానికి నాంది పలికిందని కొనియాడారు. కేసీఆర్ దీక్షకు ముందు, కేసీఆర్ దీక్ష తర్వాత పరిణామాల్లో పూర్తిగా భిన్నత్వం ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
BRS Complaints | గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

