వినాయక శోభయాత్రలో యువకుడి గొంతు కోసే యత్నం
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చేందుకు...
మాడుగులపల్లి, సెప్టెంబర్ 23 : నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుక్కడం గ్రామంలో వినాయక నిమజ్జన శోభయాత్ర వైభవంగా సాగుతోంది. ఊరేగింపు గ్రామంలోని బస్టాండ్ సమీపానికి చేరుకోగానే, పోతపాక సాయి అనే యువకుడిపై కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్ర ఆవేశంతో సాయి గొంతు కోసేందుకు యత్నించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రక్తపుమడుగులో ఉన్న సాయిని చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా? లేక శోభయాత్రలో తలెత్తిన గొడవల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

