జైపూర్: భారీ కంటైనర్ లారీ డ్రైవర్ ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. ఆ లారీ కదులుతుండగా దాని టాప్‌పైకి ఎక్కాడు. అక్కడ డ్యాన్స్ చేశాడు. అలాగే చాలాసేపు స్టీరింగ్ వదిలేసి విండోపై నిల్చొని స్టంట్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Driver Climbs Onto Moving Truck, Dances) రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ సంఘటన జరిగింది. ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహియా తిబారా సమీపంలో రోడ్డుపై వెళ్తున్న భారీ ట్రైలర్ డ్రైవర్ డేంజరస్ స్టంట్లు చేశాడు. స్టీరింగ్ వదిలేసిన అతడు క్యాబిన్ టాప్‌పైకి ఎక్కాడు. అక్కడ డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత క్యాబిన్లోకి వెళ్లాడు. మళ్లీ బయటకు వచ్చాడు. డోర్ విండోపై వేలాడుతూ విన్యాసాలు చేశాడు.
కాగా, ఇది చూసి ఆ రోడ్డున వెళ్లే వాహనదారులు షాక్ అయ్యారు. లారీ డ్రైవర్ స్టీరింగ్ వదిలేసి స్టంట్లు చేయడంతో ఏదైనా ప్రమాదం జరుగవచ్చని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ వాహనానికి దూరంగా తమ వాహనాలు నడిపారు.
మరోవైపు ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అతడి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, నడిచి వెళ్లే వారికి ప్రమాదాన్ని కలిగించే రీతితో విన్యాసాలు చేసిన ఆ డ్రైవర్‌పై మండిపడ్డారు. ఆ డ్రైవర్‌ను గుర్తించి అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
अलवर में इस ट्रक ड्राइवर ने तो लोगों की साँसे ऊपर नीचे कर दी pic.twitter.com/mFPwViF6jZ
— Hemant Kumar (@hemantkumarnews) August 15, 2026