Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Congress Leader | హన్మకొండ సుబేదారిలోని అలిపురలో నివాసముంటున్న ఎమ్మెల్యే నాయిని అనుచరుడు కాంగ్రెస్ నాయకుడు ఇస్మాయిల్‌ను విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగేందుకు విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లింది.
Congress Leader | కాంగ్రెస్ సర్కార్ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు దౌర్జన్యాలు చేస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తుందని తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు అలాంటి హంగామానే సృష్టించాడు. హన్మకొండలో కరెంట్ బిల్లు కట్టకుండా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు హల్ చల్ చేశాడు.
హన్మకొండ సుబేదారిలోని అలిపురలో నివాసముంటున్న ఎమ్మెల్యే నాయిని అనుచరుడు కాంగ్రెస్ నాయకుడు ఇస్మాయిల్‌ను విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగేందుకు విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లింది. భారీగా పెండింగ్‌లో ఉన్న కరెంట్బిల్లులు కట్టకపోవడంతో లైన్మెన్ కరెంట్ పోల్ ఎక్కి కనెక్షన్ తీసేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇస్మాయిల్ విద్యుత్ సిబ్బందిపై రూ.8 వేలు, రూ.12 వేలు బిల్లులకే తమాషాలు చేస్తున్నరా.. మీకు సిగ్గుందా.. మనుషులా గాడిదలా..? ఎమ్మెల్యే చెప్పిన లెక్కలేదా మీకు.. వినరా అంటూ బూతుపురాణం అందుకున్నాడు.
అయితే ఓ వైపు ఇస్మాయిల్ రూ.8 వేలు మాత్రమే బకాయి ఉందంటుంటే.. మరోవైపు ఇస్మాయిల్ ఇంటికి రూ.28 వేల బిల్లు, వేయి స్తంభాల గుడి వద్ద ఉన్న యూనికాన్ కూలర్స్ షాపుకు రూ.80 వేలు, మడికొండలోని యూనికాన్ ఇండస్ట్రీకి రూ.2.50 లక్షలు, మొత్తం రూ.3.58 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
ఇస్మాయిల్ విధుల్లో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై దాడికి పాల్పడుతూ.. బూతులతో రెచ్చిపోయిన వీడియో నెట్టింట్ రౌండప్ చేస్తోంది.
బిల్లు కట్టడం లేదని విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లగా.. తమ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసినందుకు కాంగ్రెస్ నాయకుడిపై బాధిత విద్యుత్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బిల్లు కట్టను.. నీ గు*లో దమ్ముంటే నా ఇంటి కరెంట్ కట్ చేసి చూపించు
మా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్తే కూడా వినరా, నా పవర్ ఏందో చూపిస్తా
మీ విద్యుత్ అధికారులు మనుషులకు పుట్టారా, గాడిదలకు పుట్టారా
మిమ్మల్ని కొట్టకుండా మామూలుగా మాట్లాడుతున్నా సంతోషించండి
హన్మకొండలో కరెంట్ బిల్లు కట్టకుండా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి వీరంగం
హన్మకొండ సుబేదారిలోని అలిపురలో ఉంటున్న కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడు ఇస్మాయిల్‌ను విద్యుత్ బకాయిలు చెల్లించమని కోరుతూ ఇంటికి వెళ్లిన విద్యుత్ సిబ్బంది
బిల్లు కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నాయిని రాజేందర్ రెడ్డి పేరు చెప్పి బెదిరిస్తూ, విద్యుత్ సిబ్బందిని బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఇస్మాయిల్
ఇస్మాయిల్ ఇంటికి రూ.28 వేల బిల్లు, వేయి స్తంభాల గుడి వద్ద ఉన్న యూనికాన్ కూలర్స్ షాపుకు రూ.80 వేలు, మడికొండలోని యూనికాన్ ఇండస్ట్రీకి రూ.2.50 లక్షలు, మొత్తం రూ.3.58 లక్షల విద్యుత్ బిల్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపిన విద్యుత్ అధికారులు
బిల్లు కట్టడం లేదని విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసినందుకు కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యుత్ సిబ్బంది
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2026
Read Also :
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

