Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Crime news | పెరూలో దారుణం జరిగింది. దుండగులు భారతీయుడిపై కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పెరూ రాజధాని లిమాకు సమీపంలో పట్టపగలే ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో భారత పౌరుడితోపాటు ఒక స్థానిక మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 29 ఏళ్ల భారత జాతీయుడు విజయ్ పగ్రానీ ఇజా, 35 ఏళ్ల పెరూ మహిళ మారి నాటలీ మిరాండా ఎస్పినోజా.. నగల ప్యాకేజీలతో జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళుతున్నారు.
Crime news : పెరూ (Peru) లో దారుణం జరిగింది. దుండగులు భారతీయుడిపై కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పెరూ రాజధాని లిమా (Lima) కు సమీపంలో పట్టపగలే ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో భారత పౌరుడితోపాటు ఒక స్థానిక మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 29 ఏళ్ల భారత జాతీయుడు విజయ్ పగ్రానీ ఇజా (Vijay Pagrani Iza) , 35 ఏళ్ల పెరూ మహిళ మారి నాటలీ మిరాండా ఎస్పినోజా (Mari Nataly Miranda Espinoza).. నగల ప్యాకేజీలతో జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కారులో వెళుతున్నారు.
ఈ క్రమంలో కోస్టా వెర్డే హైవేపై శాంటా రోసా అవెన్యూ వద్ద ముసుగులు ధరించిన కొందరు దుండగులు వారి వాహనాన్ని అడ్డగించారు. కారు విండోస్ లక్ష్యంగా కాల్పులు జరిపి, ఆ కారులోని నగలు ఉన్న బ్రీఫ్కేసులతో పరారయ్యారు. ఈ దాడిలో విజయ్, ఎస్పినోజా ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే శాన్ జుడాస్ టాడియో క్లినిక్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ దోపిడీపై సమాచారం అందుకున్న పెరూ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల కారులో ఉన్న బంగారం కడ్డీలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా..? లేదంటే మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దోపిడీకి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. దోపిడీ జరిగిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
In La Perla, Callao (#Peru), a group of at least seven armed individuals intercepted two vehicles on a stretch of the Costa Verde, sparking a shootout with a black armored Jeep SUV bearing license plate D8B-463 that was heading to Jorge Chávez Airport.
Those affected were 35-year-old Mari Nataly Miranda Espinoza and 29-year-old Indian national Vijay Pagrani Iza; the criminals made off with suitcases and bags containing gold bars, and police found cell phones that had been thrown over the cliff during the escape.
The robbery involved eight vehicles, according to initial reports, caused panic in the area, and is under investigation by the PNP.
— Siraj Noorani (@sirajnoorani) November 28, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

