Lavanya Tripathi | డాక్టర్స్ హెచ్చరించిన కూడా రిస్క్ చేసి షూటింగ్ పూర్తి చేసిన లావణ్య త్రిపాఠి.. కాని ఆ తర్వాత..
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య, మూవీ టీమ్ కలిసి యాంకర్ సుమ కనకాలతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య, మూవీ టీమ్ కలిసి యాంకర్ సుమ కనకాలతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితమే పండంటి బాబుకు జన్మనిచ్చిన లావణ్య, ఈ సినిమాను తాను గర్భవతిగా ఉన్నప్పుడే పూర్తి చేసినట్లు వెల్లడించారు. “షూటింగ్ పనులు అన్నీ ప్రారంభమైన తర్వాత ‘నో’ అంటే నిర్మాతలకు నష్టం అవుతుందని భావించాను. అందుకే ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా షూటింగ్ చేశాను. వాంతులు అయ్యాక కూడా సెట్‌కి వెళ్లేదాన్ని. మైగ్రేన్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుని షూట్ చేసేదాన్ని” అని చెప్పారు.
యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా భయపడ్డానని, ప్రతి షెడ్యూల్ పూర్తయ్యాక ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకునేదాన్నని తెలిపారు. మూడు నెలల్లోపే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారని చెప్పారు. డ్యాన్స్ సీక్వెన్స్ సమయంలో కూడా భయం వేసిందని, కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ తన పరిస్థితిని అర్థం చేసుకుని తగిన విధంగా స్టెప్స్ కంపోజ్ చేశారని వెల్లడించారు. కాస్ట్యూమ్స్ కూడా బేబీ బంప్ కనిపించకుండా ప్రత్యేకంగా లూజ్‌గా డిజైన్ చేయించామని తెలిపారు. నాలుగో నెలలో ప్యాచ్‌వర్క్ చేయాల్సి వచ్చిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. ఇంట్లోవాళ్లు మొదట భయపడినా, చివరికి పూర్తి సపోర్ట్ ఇచ్చారని, ముఖ్యంగా తన భర్త వరుణ్ తనకు చాలా అండగా నిలిచారని పేర్కొన్నారు.
డాక్టర్లు ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని చెప్పేవారు. షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగేదని, ప్రతిరోజూ పొద్దున్నే లేచి వెళ్లడం కాస్త ఇబ్బందిగా అనిపించేదని చెప్పారు. “ప్రెగ్నెన్సీ విషయం షూటింగ్ సమయంలో ఎవరికీ తెలియదు. తెలిసిస్తే ప్రత్యేకంగా చూస్తారనిపించి చెప్పలేదు. భయంతోనే సినిమా పూర్తి చేశాను” అని లావణ్య వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు సత్య మాట్లాడుతూ, “మొదటి రోజే ఒక సీన్ షూట్ చేసిన తర్వాత లావణ్య ప్రెగ్నెంట్ అని చెప్పింది. నేను షాక్ అయ్యాను. నిర్మాతలకు వెంటనే చెప్పాలా వద్దా అనేది అర్థం కాలేదు. షూటింగ్ ఆగిపోతుందేమో అనిపించింది. అందుకే నెలరోజుల పాటు ఎవరికీ చెప్పకుండా షూట్ చేశాం. తర్వాత నిర్మాతకు చెప్పగా వారు అర్థం చేసుకున్నారు” అని తెలిపారు.లావణ్య ప్రెగ్నెన్సీ సమయంలోనూ రిస్క్ తీసుకుని సినిమా పూర్తి చేయడం పట్ల అభిమానులు ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ‘సతీ లీలావతి’ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

