Watch: మటన్ షాపులోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. తర్వాత ఏం జరిగిందంటే?
Python Enters Meat Shop | భారీ కొండచిలువ ఒక మటన్ షాపులోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మేకల్లో ఒక దానిని తినేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఒక తాగుబోతు అక్కడకు చేరుకున్నాడు. ఆ కొండచిలువను పట్టుకుని విన్యాసాలు చేశాడు. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు.
లక్నో: భారీ కొండచిలువ ఒక మటన్ షాపులోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న మేకల్లో ఒక దానిని తినేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఒక తాగుబోతు అక్కడకు చేరుకున్నాడు. ఆ కొండచిలువను పట్టుకుని విన్యాసాలు చేశాడు. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. (Python Enters Meat Shop) ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి వేళ ఒక మాంసం దుకాణంలోకి 15 అడుగుల పొడవైన కొండచిలువ ప్రవేశించింది. అక్కడ ఉన్న మేకల్లో ఒక దానిని మింగేందుకు ప్రయత్నించింది. ఆ మటన్ షాపు యజమాని దానిని గమనించాడు.
కాగా, ఇంతలో బాగా మద్యం సేవించిన సురేష్ అనే వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. ఏమాత్రం భయం లేకుండా ఆ భారీ కొండచిలువను చేతులతో పట్టుకున్నాడు. విడిపించుకునే ప్రయత్నంలో అతడి చేతిని అది చుట్టుకున్నది. తప్పించుకునే ప్రయత్నంలో సురేష్ చేతిని సుమారు రెండుసార్లు కొరికింది. అయితే కొండచిలువలకు విషం ఉండకపోవడంతో అతడికి ఏమీ కాలేదు.
మరోవైపు మద్యం మత్తులో ఉన్న సురేష్ ఆ కొండచిలువను తన భుజంపై వేసుకున్నాడు. దానితో ఆడుకోవడం ప్రారంభించాడు. దీంతో ఈ వింతను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఆ తర్వాత సురేష్ ఒక పెద్ద డబ్బాలో ఆ కొండచిలువను బంధించాడు. దానిని తీసుకెళ్లి ఒక కాలువలో వదిలిపెట్టాడు.
అయితే తన కోపాన్ని ప్రదర్శించిన ఆ కొండచిలువ సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు తలను పైకి లేపింది. కొంతసేపటి తర్వాత పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ కొండచిలువతో సురేష్ విన్యాసాలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बाराबंकी में मीट की दुकान में घुसा 15 फीट लंबा अजगर, युवक ने पकड़कर किया बंद
बाराबंकी। नगर कोतवाली क्षेत्र में एक मीट की दुकान में करीब 15 फीट लंबा अजगर घुस गया। बताया जा रहा है कि अजगर बकरियों का शिकार करने की फिराक में था।
अजगर को देखकर मौके पर हलचल मच गई। इसी दौरान एक युवक… pic.twitter.com/d7Gy7UO6jR
— Vishnu Kumar Sonkar (@VishnukrSonkar) August 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

