జ్ఞానేశ్ నాకు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు
‘2016లో ఓ రోజు ఢిల్లీ నుంచి బయల్దేరే ఓ విమానంలో నేను కూర్చున్నా. అప్పుట్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్‌కుమార్ కూడా అదే విమానంలో ఉన్నారు. నన్ను చూసి తన పక్క సీటులోకి రమ్మని పిలిచారు. చాలా విషయాలు మాట్లాడారు. రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ ఏమిటని అడిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలోని పథనంతిట్ట సీటు నుంచి పోటీ చేస్తావా? అని అడిగారు. టికెట్ తాను ఇప్పిస్తానని చెప్పారు.
- పోటీ చేస్తే, మంత్రి పదవి కూడా వస్తుందంటూ ఆశజూపారు
- అయితే, ఆయన ఆఫర్‌ను నేను వెంటనే తిరస్కరించాను
- నాకు ఎన్నికలపై ఆసక్తి లేదంటూ ఆయన ముఖంపైనే చెప్పా
- కేరళం మాజీ సీఎస్ జీజీ థామ్సన్ సంచలన వ్యాఖ్యలు
- జ్ఞానేశ్ బీజేపీ మనిషి అనడానికి ఇదే రుజువు: విపక్షాలు
‘2016లో ఓ రోజు ఢిల్లీ నుంచి బయల్దేరే ఓ విమానంలో నేను కూర్చున్నా. అప్పుట్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్‌కుమార్ కూడా అదే విమానంలో ఉన్నారు. నన్ను చూసి తన పక్క సీటులోకి రమ్మని పిలిచారు. చాలా విషయాలు మాట్లాడారు. రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ ఏమిటని అడిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలోని పథనంతిట్ట సీటు నుంచి పోటీ చేస్తావా? అని అడిగారు. టికెట్ తాను ఇప్పిస్తానని చెప్పారు.
-జీజీ థామ్సన్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వివాదాస్పద ‘సర్’తో ఇప్పటికే అప్రతిష్ట మూటగట్టుకొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై కేరళం మాజీ చీఫ్ సెక్రటరీ జీజీ థామ్సన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. బీజేపీ తరుఫున పోటీ చేయాలంటూ జ్ఞానేశ్ తనకు టికెట్ ఆఫర్ ఇచ్చారని, అయితే ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు థామ్సన్ పేర్కొనడం దుమారం రేపింది. బీజేపీకి ఏజెంట్‌గా జ్ఞానేశ్‌కుమార్ వ్యవహరిస్తున్నారని, ఆయన చర్యలతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై మరింత అపనమ్మకం కలిగేలా చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ కోసం జ్ఞానేశ్ పనిచేస్తున్నారనడానికి థామ్సన్‌కు ఆశజూపిన టికెటే సాక్ష్యమని ధ్వజమెత్తుతున్నాయి.
గత సెప్టెంబర్‌లో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో థామ్సన్ మాట్లాడుతూ ఢిల్లీ విమానాశ్రయంలో జ్ఞానేశ్తో జరిగిన సంభాషణను వెల్లడించారు. థామ్సన్ కథనం ప్రకారం.. ‘అది 2016వ సంవత్సరం. నేను సర్వీసులోనే ఉన్నా. అప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఓ విమానంలో నేను కూర్చున్నా. అదే విమానంలో అప్పుడు కేంద్రహోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా జమ్ముకశ్మీర్ బాధ్యతలు చూస్తున్న ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ ఉన్నారు. నన్ను చూసిన జ్ఞానేశ్‌కుమార్ తన పక్క సీటులోకి రమ్మని పిలిచారు.
అనంతరం ఎన్నికల పరిణామాల గురించి మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలనుకొంటున్నట్టు నన్ను అడిగారు. దీనికి నేను.. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఓ ప్రాజెక్టు చేయాలనుకొంటున్నట్టు చెప్పా. అయితే, దీనికి స్పందించిన జ్ఞానేశ్.. రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలోని పథనంతిట్ట ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని నాకు టికెట్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా, రిటైర్డ్ ఐఏఎస్ కోటాలో కేంద్రమంత్రి పదవి కూడా వస్తుందని ఆశజూపారు. కేంద్రంలో మోదీ ప్రతిష్ట పెరుగుతుందని, కేరళంలోనూ బీజేపీకి మంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని ఈ సందర్భంగా జ్ఞానేశ్‌కుమార్ నాతో అన్నారు.
అయితే, జ్ఞానేశ్ ప్రతిపాదనను నేను వెంటనే తిరస్కరించా. నాకు ఎన్నికలపై ఆసక్తి లేదని ఆయన ముఖంమీదే చెప్పా’ అని థామ్సన్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరూ ఐఏఎస్‌లే. అనంతర కాలంలో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికల వ్యవస్థకు అత్యున్నత అధికారి హోదాలో జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి అధికారిని సీఈసీగా నియమించిందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. జ్ఞానేశ్‌కుమార్.. గతంలో బీజేపీ తరుఫున ఓ ఏజెంట్లా మారి మరో ఐఏఎస్ అధికారికి టెకెట్ ఇస్తామని హామీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్‌గా కాకుండా బీజేపీ మద్దతుదారుగా వ్యవహరించిన జ్ఞానేశ్‌కుమార్ ఈ విషయం బయటపడగానే నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేసి ఉండాల్సింది.
అయినప్పటికీ, తన పదవిని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు. కాగా, బీజేపీకి మద్దతుగా జ్ఞానేశ్‌కుమార్ రాయభారం నడపాల్సిన అవసరం ఆ పార్టీకి తప్ప మరే ఇతరులకు లేదు. బీజేపీ అడిగిస్తేనే ఆయన ఈ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి బీజేపీకి సీఈసీ ఓ ఏజెంట్‌గా మారారని, బీజేపీ చెప్పుచేతల్లోకి ఈసీ వెళ్లిపోయిందని విపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా, థామ్సన్ ఆరోపణలు నిజమో కాదోనని మీడియా సంస్థలు పరిశీలించగా, ఆరోజున జ్ఞానేశ్‌కుమార్, థామ్సన్ ఒకే విమానంలో ప్రయాణించినట్టు రుజువు కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

