బర్త్ సర్టిఫికెట్‌కూ ఎసర్!
సర్ ప్రక్రియలో తండ్రి పేరు ఓటరు జాబితా నుంచి తొలగించడంతో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఓ రెండున్నర నెలల శిశువుకు జనన ధ్రువపత్రాన్ని అధికారులు నిరాకరించారు.
- తండ్రి పేరు ఓటరు జాబితాలో లేదని చిన్నారికి జనన ధ్రువీకరణ నిరాకరణ
- బెంగాల్ బీజేపీ సర్కార్ నిర్ణయం
కూచ్‌బెహార్, నవంబర్ 25: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్) దుష్పరిణామాలు విస్తుగొలుపుతున్నాయి. సర్ ప్రక్రియలో ఓటరు జాబితాలో పేరు గల్లంతైన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తూ ఇప్పటికే పలు బీజేపీ పాలిత రాషా్ర్టలు ఆదేశాలివ్వగా, కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాలకు ఆధార్ కార్డుకు బదులుగా ఓటరు కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బర్త్ సర్టిఫికెట్జారీకి, సర్‌కు ముడిపెడుతుండటం విస్మయం కలిగిస్తున్నది.
సర్ ప్రక్రియలో తండ్రి పేరు ఓటరు జాబితా నుంచి తొలగించడంతో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఓ రెండున్నర నెలల శిశువుకు జనన ధ్రువపత్రాన్ని అధికారులు నిరాకరించారు. ఖటామరీ గ్రామానికి చెందిన అమీనా ఖాతూన్ సెప్టెంబర్ 9న దిన్హటా సబ్‌డివిజనల్ దవాఖానలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం ఆమె, భర్త అబ్దుల్ హబీబ్ తమ కుమార్తె జనన ధ్రువపత్రం కోసం దవాఖానను, సంబంధిత పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించారు. పంచాయతీ ప్రధాన్ లేదా ఎమ్మెల్యే నుంచి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తమను కోరారని ఆ శిశువు తల్లిదండ్రులు తెలిపారు. ధ్రువీకరణ కోసం దిన్హటా నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌ను హబీబ్ సంప్రదించగా, ఎమ్మెల్యే కార్యాలయం అభ్యర్థనను తిరస్కరించిందని తెలిపారు.
సర్ ప్రక్రియలో తన పేరు ఓటరు జాబితా నుంచి తొలగించినందున ధ్రువపత్రం జారీ చేయలేమని అక్కడ చెప్పారని పేర్కొన్నారు. ‘నేను బంగ్లాదేశ్ పౌరుడినని, ముందుగా జాతీయ పౌరుల నమోదు పట్టికలో నా పేరు నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయ అధికారి చెప్పారు. నేను ఎందుకు చేయించుకోవాలి? పుట్టినప్పటి నుంచి ఈదేశంలోనే ఉంటున్నాను. ఖటామరీలోని మా ఇంటిని మా తాత కట్టించారు. అన్ని పత్రాలు చూపించినా వారు తిరస్కరించారు’ అని హబీబ్ చెప్పారు.సర్‌లో పేరు పోయిన కుటుంబ సభ్యుల్లో హబీబ్ ఒక్కరే కాదు. ఆయన తన ముగ్గురు సోదరీమణుల పేర్లను కూడా తొలగించారు. దీనిపై హబీబ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, దరఖాస్తుపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉన్నది.
ఏపీసీఆర్ ఆగ్రహం
శిశువుకు జనన ధ్రువపత్రం ఇవ్వకుండా పరిపాలనా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘జనన నమోదు చట్టబద్ధ బాధ్యత. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒప్పందంలోని ఏడో అధికరణం ప్రకారం ప్రతి చిన్నారికి తక్షణ నమోదు, చట్టబద్ధ గుర్తింపు హక్కుగా ఉంటాయి. చిన్నారి చట్టబద్ధ గుర్తింపును తల్లిదండ్రుల ఓటరు హోదాతో ముడిపెట్టరాదు. సర్‌కు సంబంధించిన పరిపాలనా వివాదం నవజాత శిశువు ప్రాథమిక హక్కులకు అడ్డంకి కాకూడదు’ అని ఏపీసీఆర్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వెంటనే శిశువుకు జనన ధ్రువపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ పథకాలు కట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టిన సర్‌లో రాష్ట్ర ఓటరు జాబితా నుంచి 91 లక్షల పేర్లను తొలగించారు. జూన్‌లో కూచ్‌బెహార్ జిల్లాకు చెందిన ఉమ్మె సల్మా పేరు సర్‌లో తొలగించారు. రేషన్ నిలిపివేసే అవకాశం ఉన్నదని స్థానిక డీలర్ చెప్పడంతో ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి లేకుండా పిటిషనర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
వివక్షకు ఆయుధంగా సర్
- కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఆగ్రహం
తిరువనంతపురం: సర్ ప్రక్రియను సంఘ్ పరివార్ పరోక్షంగా ఎన్ఆర్సీ అజెండాను అమలు చేసేందుకు ఉపయోగించుకుంటున్నదని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఈ ప్రక్రియను ఆయుధంగా మలుచుకుని వివక్షకు, ప్రాథమిక హక్కుల నిరాకరణకు పాల్పడుతున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నట్లు వార్తల్లో వచ్చిన ఓ ఘటనపై స్పందించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో తండ్రి పేరు తొలగించారనే కారణంతో ఓ నవజాత శిశువుకు జనన ధ్రువీకరణ పత్రం నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ ఘటన దిగ్భా్రంతికరమని విజయన్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణను వివక్షకు, ప్రాథమిక హక్కులను నిరాకరించే సాధనంగా మారుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న ఈ దాడిని ప్రతిఘటించాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని విజయన్ పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

