ట్రెజరీల్లో నిధుల ఫ్రీజింగ్
ట్రెజరీల్లో ‘ఫ్రీజింగ్' పేరిట బిల్లుల చెల్లింపులపై రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక నిషేధం విధించడం గందరగోళానికి దారితీస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో అప్పటికప్పుడు విధిస్తున్న ఆంక్షలతో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు జీతాలు, పింఛన్, డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు.
- నిలిచిపోతున్న అన్ని రకాల చెల్లింపులు
- ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లే.. పంచాయతీలకు అందని అభివృద్ధి నిధులు
- కాంట్రాక్టర్లకు నిలిచిన బిల్లులు
- సర్వర్‌డౌన్ అంటున్న ట్రెజరీ సిబ్బంది
- ఆందోళనలో అన్ని వర్గాలు
జనగామ, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ట్రెజరీల్లో ‘ఫ్రీజింగ్’ పేరిట బిల్లుల చెల్లింపులపై రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక నిషేధం విధించడం గందరగోళానికి దారితీస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో అప్పటికప్పుడు విధిస్తున్న ఆంక్షలతో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు జీతాలు, పింఛన్, డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ట్రెజరీలో కొనసాగుతున్న ఫ్రీజింగ్ టెర్రర్‌కు సాంకేతిక సమస్యను బూచి చూపుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధిత శాఖతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులపాల్జేస్తున్నది. జీపీఎఫ్, ఫెస్టివల్ అడ్వాన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి బిల్లులపై నెలంతా ఫ్రీజింగ్ కొనసాగుతుండగా, మరికొన్ని బిల్లుల చెల్లింపులపై క్షణాల్లోనే సర్కార్ నుంచి నిషేధిత ఉత్తర్వులు వెలువడుతుండటం గమనార్హం. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏమీ లేకపోయినా పలు సందర్భాల్లో సర్వర్ డౌన్ వంటి సాంకేతిక లోపాల పేరిట ఫ్రీజింగ్ అమలవుతుండటం అనుమానాలకు తావిస్తున్నది. అంతా ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్నందున ఫ్రీజింగ్ విషయంలో ఉత్తర్వులపై ట్రెజరీ ఉద్యోగులను బాధితులు నిలదీస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రాష్టవ్యాప్తంగా ఉన్న 5.5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించకపోతే వారికి సంబంధించిన బిల్లులు పెట్టని అధికారుల జీతాలు ఆపాలని ఇటీవల జరిగిన ఉద్యోగుల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఉదాహరణకు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని ఔట్సోర్సింగ్, దినసరి వేతనంపై పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వంటి ఇతర ఉద్యోగులకు 25వ తేదీ దాటినా వేతనాలు అందక వారి కుటుంబం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. నెలలో దాదాపు 20 రోజులకుపైగా ఈ అనధికారిక ఫ్రీజింగ్ కొనసాగుతుండటంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు సైతం ఆటంకాలు ఎదురవుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలు మినహా మిగిలిన అన్నింటికీ ఫ్రీజింగ్ బూచి చూపుతున్నారు. ట్రెజరీ డిపార్ట్మెంట్లో సాగుతున్న కొత్త తరహా సంక్షోభం కారణంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రతినెలా బిల్లుల చెల్లింపులకు ఆంక్షలు కొనసాగుతుండటంతో పనులకు సంబంధించిన చెల్లింపులు జరగడంలేదని అంటున్నారు.
ప్రధానంగా ఎస్ఎఫ్సీ, జనరల్ ఫండ్, వివిధ ఆర్థిక సంఘాలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వ్యయంపై కూడా ట్రెజరీ ఆంక్షల ప్రభావంతో పనులు ముందుకు సాగడంలేదు. బిల్లుల చెల్లింపుల కోసం సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు ఆయా జిల్లాల ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆన్లైన్ క్లియరెన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల బిల్లుల చెల్లింపులపై ప్రతినెలా 20 రోజులకుపైగానే అనధికార ఆంక్షలు కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ అధికారులు మాత్రం సర్వర్ డౌన్ పేరిట సమాచారం ఇస్తూ దాటవేత వైఖరిని ప్రదర్శిస్తుండటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

