అప్పు చేసి పప్పన్నం!
పెండ్లి.. జీవితంలోనే అత్యంత అందమైన ఘట్టం. పూర్తి ఆనందంతో జరుపుకోవాల్సిన సంబురం. కానీ, ఆ ఒక్కరోజు ఆడంబరం కోసం అనేకమంది అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ అంచనా ప్రకారం.. మనదేశంలో పెండ్లి కోసం సగటున రూ.15.5 లక్షల రుణం తీసుకుంటున్నారు. ఫలితంగా, ఈఎంఐల ఊబిలోకి జారిపోతున్నారు. ఏండ్ల తరబడి రుణ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు.
పెండ్లి.. జీవితంలోనే అత్యంత అందమైన ఘట్టం. పూర్తి ఆనందంతో జరుపుకోవాల్సిన సంబురం. కానీ, ఆ ఒక్కరోజు ఆడంబరం కోసం అనేకమంది అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ అంచనా ప్రకారం.. మనదేశంలో పెండ్లి కోసం సగటున రూ.15.5 లక్షల రుణం తీసుకుంటున్నారు. ఫలితంగా, ఈఎంఐల ఊబిలోకి జారిపోతున్నారు. ఏండ్ల తరబడి రుణ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు.
మనదేశంలో పెండ్లి అంటే.. ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాదు. అది ఇరు కుటుంబాల భావోద్వేగాలు, బంధుమిత్రుల సందడి, జీవితకాలపు జ్ఞాపకాలు కలబోసిన వేడుక. ‘పెండ్లి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది కదా!’ అనే భావన; సమాజంలో హోదాను కాపాడుకోవాలనే తపన; నలుగురూ ఏమనుకుంటారో అనే భయంతో ఓ తప్పటడుగు వేస్తారు. వివాహ వేడుక కోసం స్థోమతకు మించి ఖర్చు చేస్తారు. అనుకున్నట్లుగానే పెండ్లితంతు జరిపించి, గుండెలపై చెయ్యి వేసుకొని.. ‘హమ్మయ్య!’ అనుకుంటారు. మరుక్షణమే.. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల భారాన్ని తలచుకొని.. గుండె దడ పెంచుకుంటారు.
గొప్పల కోసం అప్పులు..
మనదేశంలో ఏటా 40 లక్షల నుంచి 50 లక్షల వివాహాలు జరుగుతున్నాయి. ఈ పెండ్లిళ్ల మార్కెట్ విలువ సుమారు రూ. 6.5 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల 2,000 మందికి పైగా జంటలపై నిర్వహించిన సర్వే ప్రకారం.. పెండ్లి ఖర్చులు గతేడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. సగటు పెండ్లి బడ్జెట్ రూ.39.5 లక్షలకు చేరింది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్స్ విషయానికొస్తే.. ఈ సగటు మరింత ఎక్కువై రూ.58 లక్షలుగా ఉంది. ఈ పెండ్లిళ్ల కోసం సుమారు 78 శాతం జంటలు తమ పర్సనల్ సేవింగ్స్‌పై ఆధారపడగా, 15.1 శాతం మంది అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులు చేసినవారు సగటున రూ.15.5 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని ఖరీదైన వెన్యూలు, ఆభరణాలు, క్యాటరింగ్ కోసమే వెచ్చించారు.
ఈఎంఐల భారం
సగటు భారతీయ మధ్యతరగతి కుటుంబానికి రూ.15.5 లక్షలు అంటే చిన్న మొత్తమేం కాదు. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఈఎంఐల చెల్లింపు సులువుగానే ఉంటుంది. కానీ, అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఆదాయం తగ్గినా… ఆ అప్పు కాస్తా పెనుభారంగా మారుతుంది. నవ దంపతులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. మరోవైపు చిన్నచిన్న ఖర్చులు, షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ లాంటి సర్వీసులు, ఇన్స్టంట్ లోన్ యాప్‌లనూ ఆశ్రయిస్తున్నారు. అనేకమంది ఈ రుణాలన్నిటినీ ఈఎంఐలలోకి మార్చుకుంటున్నారు. అప్పులు తీర్చడానికి ఏండ్ల తరబడి ఈఎంఐలు చెల్లిస్తున్నారు.
రంగంలోకి ‘బ్రేక్ ది డెట్ చైన్’..
పెండ్లి అప్పుల సమస్యను గుర్తించిన ‘సెటిల్ మై లోన్’ సంస్థ.. ‘బ్రేక్ ది డెట్ చైన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘45 రోజుల్లో లోన్ సెటిల్మెంట్ చాలెంజ్’ను తీసుకొచ్చింది. అప్పుల భారం, ఈఎంఐల తలనొప్పులు తప్పించుకోవడానికి కొన్ని సలహాలు-సూచనలు అందిస్తున్నది.
- మీ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని బట్టి పెండ్లి ఖర్చులను ముందే ప్రణాళిక చేసుకోండి. అప్పు అనేది ఎప్పుడూ చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలి. రుణమే ప్రధాన నిధిగా మారకూడదని తెలుసుకోండి.
- ఆడంబరాల కన్నా.. బంధాలకు విలువ ఇవ్వండి. సోషల్ మీడియాలో కనిపించే హంగూ ఆర్భాటాల కోసం భారీగా అప్పులు చేయడం వల్ల కొత్త జీవితం ఆర్థిక ఒత్తిడితో ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి.
- ఒకవేళ అప్పుల ఊబిలో చిక్కుకుని రికవరీ ఏజెంట్ల ఒత్తిడి ఎదుర్కొంటుంటే, ఒంటరిగా బాధపడకండి. నిపుణుల సహాయం తీసుకోండి. చివరగా.. పెండ్లి అనేది జీవితంలో ఓ అందమైన ప్రారంభం కావాలి. అతేకానీ, ఆర్థిక ఇబ్బందులకు నాంది పలకకూడదు. అందుకే, ఆనందకరమైన భవిష్యత్తు కోసం సరైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

