భారత్‌పై 25 శాతం సుంకం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై గరిష్ఠంగా 25 శాతం సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది.
- ట్రంప్ సర్కార్ ప్రతిపాదన
- అత్యధికంగా చైనాపై 40% టారిఫ్
- మరికొన్ని దేశాలపైనా సుంకాలు
- డిమాండ్‌కు మించి ఉత్పత్తి, పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడాన్ని కారణంగా చూపుతూ చర్యలు
వాషింగ్టన్, నవంబర్ 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై గరిష్ఠంగా 25 శాతం సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో మార్కెట్ డిమాండ్‌కు మించిన పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని అమెరికా చెబుతున్నది. రాయిటర్స్ ఉదహరించిన అధికారిక ప్రకటన ప్రకారం.. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం తాజా ప్రణాళికలో భారత్‌తోపాటు కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలపై 25 శాతం వరకు సుంకాలు ప్రతిపాదించారు.
మార్కెట్ అవసరానికి మించి తయారీ, ఉత్పత్తికి మద్దతు ఇస్తూ అమెరికా వ్యాపారాలపై ఒత్తిడి తెస్తున్నారని తాను లక్ష్యంగా చేసుకున్న కొన్ని దేశాలపై వాషింగ్టన్ ఆరోపణలు చేసింది. భారత్‌కు ప్రతిపాదించిన రేటు.. 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలను కవర్ చేసే విస్తృత సుంకాల ప్యాకేజీలో భాగం. తయారీ రంగాల్లో నిర్మాణాత్మక అధిక సామర్థ్యాన్ని, ఉత్పత్తిని సృష్టించే, కొనసాగించే లేదా వాటికి తోడ్పడే చర్యలు, విధానాలు, పద్ధతులను అనుచితమైనవిగా గుర్తించామని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం తెలిపింది.
అమెరికా దర్యాప్తు వెనుక ఏమున్నది
మార్కెట్ డిమాండ్ మద్దతు ఇవ్వగల స్థాయిని మించి దేశాలు ఉత్పత్తి, పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడాన్ని ట్రంప్ ప్రభుత్వం ‘నిర్మాణాత్మక అధిక సామర్థ్యం’గా పేర్కొంటున్నది. పారిశ్రామిక విధానాలు, సబ్సిడీలు, మార్కెట్ నియమాలు పూర్తిగా వర్తించని ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే విడిభాగాలతో ముడిపడిన సరఫరా గొలుసులు ఇందుకు కారణాలని అమెరికా అధికారులు సూచించారు. ఈ దర్యాప్తులో భారత్‌ను జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన తయారీ దేశాలు, అమెరికా మిత్ర దేశాలతోపాటు చేర్చారు.
తాజా ప్రణాళికలో చైనాపై 40 శాతం వరకు సుంకాలతో అత్యంత కఠిన ప్రతిపాదన చేశారు. యూరోపియన్ యూనియన్ కూటమి, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్, బంగ్లాదేశ్‌లపై 20 శాతం వరకు సుంకాలు ప్రతిపాదించారు. భారత్, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్న వేళ భారత్‌కు ఈ ప్రతిపాదన మరో అడ్డంకిగా మారనున్నది. అయితే, 25 శాతం రేటు వెంటనే అమల్లోకి వస్తుందని దీని అర్థం కాదు. అమలుకు ముందు ప్రజాభిప్రాయాల స్వీకరణ, విచారణల ప్రక్రియ జరగాల్సి ఉన్నది. వివిధ దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల పరిమితుల్లోనే కొత్త సుంకాలను ఉంచుతామని అమెరికా తెలిపింది. అమెరికా అధికారి పేర్కొన్న చట్టం కింద వాషింగ్టన్‌తో భారత్‌కు ఇంకా తుది వాణిజ్య ఒప్పందం కుదరలేదని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

