డిసెంబర్ 15లోపు వింటర్ సెషన్!
వచ్చే నెల 15 లోపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు పీటీఐ తెలిపింది. ఆ తేదీలోగా పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆలోపు విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులను కోరినట్టు వెల్లడించింది.
- విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దు
- మంత్రివర్గానికి ప్రధాని ఆదేశం
- డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను తీసుకురానున్న కేంద్రం
న్యూఢిల్లీ, నవంబర్ 25: వచ్చే నెల 15 లోపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు పీటీఐ తెలిపింది. ఆ తేదీలోగా పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆలోపు విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులను కోరినట్టు వెల్లడించింది. తేదీలు, సమావేశాల కాలవ్యవధిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
కీలకంగా డీలిమిటేషన్ బిల్లు
నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడ్డ మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా ఉండే అవకాశం ఉన్నది. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన ప్రతిపాదనపై చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తదుపరి పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగినట్టు పీటీఐ తెలిపింది. తమ తమ మంత్రిత్వ శాఖలు సమావేశాలకు సిద్ధంగా ఉండేలా చూడాలని మంత్రులను ప్రధానమంత్రి కోరారు. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడిన వర్షాకాల సమావేశాలను ఇంకా అధికారికంగా ముగించలేదు.
మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం
రానున్న సమావేశాల్లో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లుకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. 543 మంది సభ్యుల సభలో 361 ఓట్లు అవసరం కావడంతో బిల్లు ఆమోదానికి కఠినమైన పరీక్ష ఎదురుకావచ్చు. ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉన్నారు.
అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వద్ద 320 మంది ఎంపీలు ఉన్నారు. అవసరమైన మెజారిటీకి చేరాలంటే ప్రతిపక్ష పార్టీల మద్దతు తప్పనిసరి. కాగా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

