అక్రమ అండాల కేసులో నిందితులను కస్టడీకి అప్పగించాలి
ఆక్రమ అండాల కేసులో ప్రధాన నిందితులు అమిత్‌శర్మ, నిఖత్శర్మ, అమిరిశెట్టి దుర్గాప్రసాద్‌లను 5రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఆక్రమ అండాల కేసులో ప్రధాన నిందితులు అమిత్‌శర్మ, నిఖత్శర్మ, అమిరిశెట్టి దుర్గాప్రసాద్‌లను 5రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ముగ్గురిపై పిటీ వారెంట్ జారీ చేయడంతో నిందితులను జైలునుంచి 7వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చినట్టు తెలిపారు. మలక్‌పేట్‌లోని ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారిని సైతం పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పుట్ల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు మల్పేట్లో కొనసాగుతున్న సద్గురు హెల్త్ సర్వీసెస్ ప్రై.లి. వ్యవస్థాపకులుగా ముగ్గురు కీలక భూమిక పోషించారని విచారణాధికారి తెలిపారు.
ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లలో నిందితులపై ఐదు కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్‌పై కోర్టు ఎదుట హాజరుపర్చడంతో విచారణ పూర్తి చేయలేకపోయామని, నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తే మరింత లోతైన దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పిస్తామని విచారణాధికారి తెలిపారు. ఫ్లాట్ నంబర్ 57లో రెండు – మూడో అంతస్తులో ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌ను కొనసాగిస్తూ అక్రమ అండాలను సరఫరా చేస్తున్నట్టు రికార్డుల ద్వారా తేలిందని తెలిపారు. మలక్‌పేట్ కేంద్రంలో కీలక రికార్డులను జప్తు చేసినట్టు తెలిపారు. మరింత సమాచారాన్ని వారినుంచి సేకరించాల్సి ఉన్నదని తెలిపారు. బేగంపేట్‌లోని అమినితా హాస్టల్లో ఇతర రాష్ర్టాలనుంచి మహిళలను తీసుకొచ్చి అక్రమంగా అండాలను సేకరించినట్టు తెలిపారు. గురువారానికి విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

