15 నెలలకు సరిపడేలా సన్నబియ్యం నిల్వలు
ఎల్ నినో ప్రభావంతో రానున్న వ్యవసాయ సీజన్లపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ఆహార భద్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎల్ నినో ముప్పు నేపథ్యంలో సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
హైదరాబాద్ , నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రానున్న వ్యవసాయ సీజన్లపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ఆహార భద్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థతోపాటు వివిధ ప్రభుత్వ సంస్థల అవసరాలను కనీసం 15 నెలలపాటు తీర్చగలిగే స్థాయిలో సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేయాలని స్పష్టంచేశారు.
పౌర సరఫరాల సంస్థ పనితీరుపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు దాదాపు 14 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మరికొన్ని నిత్యావసర వస్తువులను అందించేందుకు ఆర్థికంగా ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వానికి బకాయిపడిన రైస్ మిల్లర్ల నుంచి ప్రతి రూపాయీ వసూలు చేసేందుకు చర్యలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

