కల..దీక్ష..సక్సెస్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు. డిసెంబర్ 9; కేసీఆర్ ఆమరణ దీక్షకు తలవంచి కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజు. ఈ రెండు తేదీలకు తెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తి, శక్తి లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. 2009 నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ‘తెలంగాణ వచ్చుడో...కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉరకలెత్తించి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఆయన కండ్లకు కట్టినట్లు చూపించారు.
నవంబర్ 29; తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు. డిసెంబర్ 9; కేసీఆర్ ఆమరణ దీక్షకు తలవంచి కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజు. ఈ రెండు తేదీలకు తెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తి, శక్తి లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. 2009 నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ‘తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉరకలెత్తించి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఆయన కండ్లకు కట్టినట్లు చూపించారు.
అదే సమయంలో దీనికి ముందు నవంబర్ 23న వరంగల్, కాకతీయ విశ్వవిద్యాలయంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు మద్దతుగా దాదాపు 20 వేల మంది విద్యార్థులతో జరిగిన సమావేశం కూడా అంతే ప్రాధాన్యత కూడుకున్నది. తెలంగాణ వ్యాప్తంగా దీక్షకు మద్దతు కూడగట్టేందుకు విద్యార్థులు, ప్రజలు సమాజంలోని అన్నివర్గాలు కదలివచ్చారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రత్యేక సమావేశమై తెలంగాణ కోసం తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో కేసీఆర్ సిద్దిపేటను దీక్ష వేదికగా ఎంచుకోవడం ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. కాకతీయ వర్సిటీ క్యాంపస్ విద్యార్థులుగా మేము కేసీఆర్ ఆమరణ దీక్షకు మద్దతుగా క్యాంపస్ కాన్వొకేషన్ గ్రౌండ్ వేదికగా 2009 నవంబర్ 23న పెద్దఎత్తున క్యాంపస్‌లో 12 విద్యార్థి సంఘాలతో ఏర్పడ్డ విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా నా అధ్యక్షతన సభ ఏర్పాటైంది.
ఉద్యమ నేత కేసీఆర్‌ను, కేయూ మాజీ వీసీ ఆచార్య జయశంకర్ సార్‌ని పిలిచి..వారికి మద్దతు ప్రకటించడమే కాకుండా ‘మీ వెంట మేమున్నాం’ అనే ఒక ధైర్యాన్ని, ‘మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక మా అడుగులు ఉన్నాయి’ అని చెప్పడానికి ఆ మీటింగ్ ఎంతో దోహదపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో కేసీఆర్ దీక్ష పట్ల చైతన్యం వెల్లివిరిసింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అది కేవలం ఒక రాజకీయ నాయకుడి దీక్ష కాదు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ప్రజల గొంతుక.
1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఎన్నోసార్లు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు.1969 తెలంగాణ ఉద్యమంతో పాటు, ఆ తర్వాత అనేక రూపాల్లో వ్యక్తమైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, పోరాటాలన్నీ ఒక పథకం, ఒక ప్రణాళిక ప్రకారం అణచివేతకు గురయ్యాయి. అణచివేతలు ఎన్నున్నా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మాత్రం ప్రజల గుండెల్లో నుంచి చెరిగిపోలేదు. తెలంగాణ పట్ల సీమాంధ్ర పాలకుల వివక్షను ఎదురిస్తూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి, గులాబీ జెండాను ఎత్తారు కేసీఆర్. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదాలుగా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో భాగస్వాములను చేశారు.
ఖమ్మం జైలులో మొదలైన కేసీఆర్ దీక్ష నిమ్స్ ఆసుపత్రికి చేరినా ఆగలేదు. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిన 11 రోజుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అంతా ఒక్కటయ్యారు. వీధులన్నీ పోరాట క్షేత్రాలయ్యాయి. రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా దీక్ష విరమణకు కేసీఆర్ ఒప్పుకోలేదు. యువకుల బలిదానాలు, ప్రజల కన్నీళ్లు, ఆగ్రహంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. 2009 డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటలకు కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. ఆసుపత్రిలో కన్నీళ్లతో కేసీఆర్ ఆమరణ దీక్ష విరమించారు. ఆ క్షణం తెలంగాణ చరిత్రలో ఒక మలుపు. అయితే పోరాటం ఇక్కడితో ఆగిపోలేదు.
సీమాంధ్ర కుట్రలు, పెట్టుబడిదారుల వొత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం అదే ఏడాది డిసెంబర్ 23న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం 2010 ఫిబ్రవరిలో పరిస్థితుల అధ్యయనానికి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇక పోరాటాలకు కొనసాగింపుగా కేసీఆర్ ఉద్యమాన్ని నిరంతరం ముందుకు నడిపారు. దేశంలోని దాదాపు 35కు పైగా ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా లేఖలు సాధించారు. ఉద్యమంలో ప్రతి అడుగు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువత రక్తం, చెమట, కన్నీళ్లతో నడిచింది.
ప్రజల పోరాటాలు, ఆకాంక్షలు, కేసీఆర్ వ్యూహాల ముందు పాలకుల కుట్రలు భగ్నమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభ ఆమోదించాయి. దీంతో 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కేవలం ఒక రాజకీయ విజయం కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ విజయం. ఒక నాయకుడు ప్రాణాలను పణంగా పెట్టి చేసిన దీక్ష ఫలితం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, లక్షలాది మంది ప్రజల పోరాటం, వేలాది అమరుల త్యాగఫలితం తెలంగాణ రాష్ట్రం.
ఆ పదకొండు రోజుల ఆకలి లేకపోతే.. ఆ విద్యార్థుల కన్నీళ్లు, ఆ అమరుల త్యాగాలు లేకపోతే.. స్వరాష్ట్రం కలగా మిగిలిపోయేది కావచ్చు. కానీ ఆ రోజు ఒక బక్క పలుచని మనిషి నిలబడ్డాడు. అతని వెనుక ఒక ప్రజా సముద్రం నిలబడింది. ఆ రోజు నుంచి నేటివరకు తెలంగాణ ప్రజలు నవంబర్ 29ని దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ దీక్ష ఒక మైలురాయి. ఈ సందర్భంగా కేసీఆర్ త్యాగాలను గౌరవించాలి. నేటి తరానికి కేసీఆర్ దీక్ష తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దీక్షా దివస్ సందర్భంగా అమరులకు నివాళులు అర్పిస్తూ..జై తెలంగాణ.
(వ్యాసకర్త: దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

