కావేరమ్మపేటలో ఈద్గా హామీ ఏమైంది?
ఈద్గా హా మీ ఏమైందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని కావేరమ్మపేటకు చెందిన మైనార్టీలు నిలదీశారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలో కావేరమ్మపేటలో ఇందిరమ్మ జీవితబీమా పథకం అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
- జడ్చర్లలో ఎమ్మెల్యేను నిలదీసిన మైనార్టీలు
జడ్చర్ల టౌన్, నవంబర్ 25: ఈద్గా హా మీ ఏమైందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని కావేరమ్మపేటకు చెందిన మైనార్టీలు నిలదీశారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలో కావేరమ్మపేటలో ఇందిరమ్మ జీవితబీమా పథకం అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈద్గా హామీపై ఎజాజ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశాడు.
కావేరమ్మపేట మైనార్టీ ముస్లింల కోసం ఈద్గా స్థలాన్ని కేటాయించి సొంత డబ్బులతో నిర్మాణం చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి మూడేండ్లు అవుతున్నా నేటికీ స్థలం కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు. అక్కడే ఉన్న ఎస్సై ఖాదర్ జోక్యం చేసుకొని అతడిని పక్కకు తీసుకెళ్లాడు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈద్గాకు సంబంధించిన ప్రపోజల్‌ను కలెక్టర్, ప్రభుత్వానికి పంపించామని, క్యాబినెట్లో అప్రోవల్ కాగానే ఈద్గా స్థలం అలాట్మెంట్ అవుతుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

