మత్స్య రంగానికి ఆ వైభవం ఏది?
గత ప్రభుత్వంలో మత్స్యరంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2014లో 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. పదేండ్లలో 4.5 లక్షల టన్నులకుపైగా పెరిగింది. 2016లో ప్రా రంభమైన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం మత్స్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
- నవంబర్ ముగుస్తున్నా పూర్తికాని చేప పిల్లల పంపిణీ
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంలో మత్స్యరంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2014లో 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. పదేండ్లలో 4.5 లక్షల టన్నులకుపైగా పెరిగింది. 2016లో ప్రా రంభమైన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం మత్స్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కానీ ఇప్పుడు జూలై, ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేపపిల్లలు నవంబర్ ముగుస్తున్నా అందడం లేదు.
సమయానికి చేపపిల్లలను చెరువుల్లో వదలకపోతే అవి పెరిగే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం రూ.116 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు కేటాయిస్తున్నది. ఈ ఏడాది 26,357 చెరువుల్లో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ చెరువుల్లో తకువ వదిలి, రికార్డుల్లో ఎకువ చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేగాక ఈ నిధులను అధికారులు, దళారులు, కాంట్రాక్టర్లు మింగేస్తున్నారని మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల హకులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. కానీ చాలా చోట్ల సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

