రాష్ర్టానికి సీఎం రేవంత్‌రెడ్డి జలద్రోహం
సీఎం కుర్చీలో కూర్చొని రేవంత్‌రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నాడని, ఇందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
- కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్సే మరోసాక్ష్యం
- ఏపీ అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తావించ లేదు
- ఇది ఏపీకి వరమైతే తెలంగాణకు శాపం కాదా?
- ఈ ద్రోహాన్ని తెలంగాణ ఎన్నటికీ క్షమించదు: హరీశ్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం కుర్చీలో కూర్చొని రేవంత్‌రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నాడని, ఇందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ కేంద్రంగా బుధవారం జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తంచేశారు.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. నాడు ఢిల్లీ వేదికగా బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పల్నాడుపై ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ నీటి హకులను కాపాడాల్సిన సీఎం ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? అని నిలదీశారు. మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రేవంత్‌రెడ్డి చేస్తున్న చారిత్రక ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించబోదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

