భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు బలహీనంగా సాగినా విదేశీ నిధుల భారీ ప్రవాహం, ముడి చమురు ధరల తగ్గుదల, అగ్రశ్రేణి బ్యాంకు షేర్ల కొనుగోళ్లతో బుధవారం దేశీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.
- సెన్సెక్స్ 1,503, నిఫ్టీ 470 పాయింట్లు వృద్ధి
ముంబై, నవంబర్ 25: ఆసియా మార్కెట్లు బలహీనంగా సాగినా విదేశీ నిధుల భారీ ప్రవాహం, ముడి చమురు ధరల తగ్గుదల, అగ్రశ్రేణి బ్యాంకు షేర్ల కొనుగోళ్లతో బుధవారం దేశీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,502.29 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ 25,819.25 వద్ద స్థిరపడింది. సోమవారం నాటి నష్టాల నుంచి కోలుకున్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 1,502.29 పాయింట్లు లేదా 1.82 శాతం ఎగిసి 83,938.28 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మధ్యలో ఇది 2,062.22 పాయింట్లు లేదా 2.50 శాతం పెరిగి 84,498.21కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 50 షేర్ల నిఫ్టీ 469.60 పాయింట్లు లేదా 1.85 శాతం పెరిగి 25,819.25 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 602 పాయింట్లు లేదా 2.37 శాతం పెరిగి 25,951.65కు చేరింది.
షేర్లవారీగా..
సెన్సెక్స్ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్ 5.94 శాతం పెరిగింది. ట్రెంట్ 3.59 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.44 శాతం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 3.24 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.18 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.04 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, టైటాన్ మాత్రం నష్టాల్లో ముగిశాయి. ‘బుధవారం మార్కెట్లు భారీగా పుంజుకుని, సోమవారం అమ్మకాలతో వచ్చిన నష్టాల నుంచి కోలుకున్నాయి. దాదాపు 2 శాతం లాభపడ్డాయి.
గ్యాప్-అప్‌తో ప్రారంభమైన సూచీలు.. సెషన్ తొలి భాగంలో లాభాలను మరింత పెంచుకున్నాయి. అయితే సోమవారం గరిష్ఠ స్థాయి వద్ద లాభాల స్వీకరణతో కొంత లాభం తగ్గింది’ అని రిలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. విదేశీ పెట్టుబడిదారుల నిరంతర కొనుగోళ్లు, ముడి చమురు ధరల తగ్గుదల, రూపాయి బలోపేతం మార్కెట్ల పుంజుకోవడానికి తోడ్పడ్డాయని ఆయన చెప్పారు.
రంగాలవారీగా..
బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.43 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.11 శాతం తగ్గాయి. బీఎస్ఈ రంగాల సూచీల్లో ఎఫ్ఎంసీజీ 3.14 శాతం, టాప్ 10 బ్యాంక్స్ 2.28 శాతం, ప్రైవేట్ బ్యాంక్స్ 2.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.79 శాతం, బ్యాంకెక్స్ 1.74 శాతం, హెల్త్‌కేర్ 1.46 శాతం, ఇన్సూరెన్స్ 1.17 శాతం పెరిగాయి. కమోడిటీస్, ఇండస్టియ్రల్స్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, హౌసింగ్ ఫైనాన్స్ సూచీలు తగ్గాయి. మార్కెట్ల ర్యాలీతో పెట్టుబడిదారుల సంపద బుధవారం రూ.3.49 లక్షల కోట్లు పెరిగి రూ.5,12,48,042.08 కోట్లకు చేరింది. ఇది 5.54 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం. అంతర్జాతీయ చమురు ప్రమాణం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.19 శాతం తగ్గి 91.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది.
ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.5,672.99 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ 6.16 శాతం, జపాన్ నిక్కీ 225 2.78 శాతం, షాంఘై ఎస్ఎస్ఈ కాంపొజిట్ 2.03 శాతం, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ 1.14 శాతం పడిపోయాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం అమెరికా ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా నష్టాల్లో ముగిశాయి. నాస్డాక్ కాంపొజిట్ 1.48 శాతం, ఎస్ అండ్ పీ 500 0.50 శాతం తగ్గగా, డౌ జోన్స్ ఇండస్టియ్రల్ యావరేజ్ 0.85 శాతం పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

