ఈసీకి చేతగాని పని పొల్లగానితో సార్థకం!
ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో వెతుక్కోండి‘ అంటూ లక్షలాది మంది ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ను ప్రజల ముందు పడేసి చేతులు దులిపేసుకుంటున్నది భారత ఎన్నికల సంఘం.
- సులభంగా ఓటరు జాబితాల సెర్చ్
- 18 ఏండ్ల విద్యార్థి అద్భుతం
- ప్రశంసిస్తున్న నేతలు, పౌరులు
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఓటరు జాబితాలో మీ పేరుందో లేదో వెతుక్కోండి‘ అంటూ లక్షలాది మంది ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ను ప్రజల ముందు పడేసి చేతులు దులిపేసుకుంటున్నది భారత ఎన్నికల సంఘం. ఈసీఐ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తమ పేర్ల కోసం వెతుకుతున్న కోట్లాది ఓటర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. స్కాన్ చేసిన పీడీఎఫ్ లలో తమ పేరు ఎక్కడ ఉందో గంటల తరబడి వెతుక్కోవడం ఓటర్లకు పెద్ద ప్రయాసగా, ప్రహసనంగా మారింది.
అయితే అలాంటి అవసరం లేకుండా కొద్ది సెకన్లలోనే పేరు కనిపించేలా చేసేందుకు ఎథికల్ హ్యాకర్ సార్థక్ సిద్ధాంత్ ముందుకొచ్చారు. గతంలో వెతకడానికి వీలుకాని సమాచారం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేలా చేశాడు. ఒక వ్యవస్థ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేసేందుకు ప్రయత్నిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రాంచీకి చెందిన 18 ఏండ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఆన్ స్కీన్ మార్కింగ్ వ్యవస్థలో అవకతవకలను ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన దృష్టి ఎన్నికల సంఘంపైన పడింది.
లక్షలాది ఓటరు జాబితా పత్రాలను సెర్చ్ చేయగలిగేలా చేయడమే ఈసారి ఆయన ముందున్న సవాలు. యూపీ ఓటరు జాబితాలకు చెందిన 6.8 లక్షల పీడీఎఫ్ ఫైళ్లను తన బృందం డిజిటలీకరించిందని సార్థక్ సిద్ధాంత్ నవంబర్ 24న ఎక్స్‌లో ప్రకటించారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 54.8 కోట్ల ఓటరు రికార్డులు ఈ ప్రక్రియలో ఉన్నాయని పేర్కొన్నారు. 18 ఏండ్ల యువకుడి ఈ ప్రయత్నానికి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, పౌర సమాజ సంస్థల నుంచి ప్రశంసలు వచ్చాయి.
ఎన్నికల సంఘం చేయని పనిని సార్థక్ చేస్తున్నారని పలువురు మెచ్చుకుంటున్నారు. సార్థక్ తాజా ప్రయత్నంలో నాలుగు రకాల ఓటరు జాబితాలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన జాబితా, సర్‌లో తయారైన ముసాయిదా, తుది జాబితాలు, 2027 ముసాయిదా ఓటరు జాబితా ఇందులో భాగం. సార్థక్ తన ఆలోచనను తరగతి గది నుంచి ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే సంస్థల వరకు తీసుకెళ్లి తన ప్రతిభతో భేష్ అన్పించుకుంటున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

