పట్టభద్రుల ఓటర్లు 5,68,105
ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది.
- ‘ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్’ ముసాయిదా జాబితా విడుదల
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. పట్టభద్రుల సంఖ్య 5,68,105గా తేలింది. తొమ్మిది జిల్లాల పరిధిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,44,161, మేడ్చల్ మల్కాజిగిరిలో 1,36,239 మంది ఓటర్లు ఉండగా..అత్యల్పంగా నారాయణపేటలో 18.846 ఓటర్లు మాత్రమే ఉన్నారు. మొత్తంగా 3,36,668 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 2,31,433గా ఉన్నారు. 31314 దరఖాస్తులను తిరస్కరించగా…వచ్చే నెల 10 వరకు అభ్యంతరాలు తెలుపడంతోపాటు, బుధవారం నుంచే ఫారం-18 ద్వారా కొత్త ఓటుకు కూడా దరఖాస్తులకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 30న ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.
అర్హులైన గ్రాడ్యుయేట్ల వివరాలతో రూపొందించిన ముసాయిదా జాబితాలను ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు) ప్రచురించారు. సీఈవో కార్యాలయ వెబ్సైట్ ceotelangana.nic.in ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచారు. రంగారెడ్డి జిల్లాలోఅత్యధికంగా 1,51,784 దరఖాస్తులు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 156 మండలాల పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తులు అందాయి. వీటిలో 5,68,105 అర్హమైనవిగా, 31,314 అనర్హమైనవిగా తేల్చారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,51,784 దరఖాస్తులు అందాయి. మేడ్చల్-మలాజిగిరిలో 1,43,052, హైదరాబాద్‌లో 1,02,919 దరఖాస్తులు వచ్చాయి. కాగా 2023 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకుముందు డిగ్రీ పూర్తిచేసి, 2026 నవంబర్ 1 అర్హత తేదీ నాటికి కనీసం మూడేళ్ల డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్ లైన్ (ceotelangana.nic.in) ద్వారా లేదా సంబంధిత ఈఆర్ ఓ/ఏఈఆర్ ఓ కార్యాలయాల్లో ఫారం-18 ద్వారా పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గడువు ముగిసినా మరో అవకాశం
వచ్చే నెల డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ తర్వాత కూడా తుది జాబితా విడుదల తేదీ నుంచి సంబంధిత ఎమ్మెల్సీ నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించిఅనుబంధ జాబితాల రూపంలో చేర్చే ప్రక్రియ ఉంటుంది.
ఆర్వీ కర్ణన్, జిల్లా ఎన్నికల అధికారి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

