బాత్రూమ్లో విద్యార్థిని ప్రసవం
డిగ్రీ విద్యార్థిని కళాశాలలోని బాత్రూమ్లో ప్రసవించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని ఈ విద్యా సంవత్సరం జూలైలో డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ) ప్రథమ సంవత్సరంలో చేరింది. ఆగస్టులో క్లాసులు ప్రారంభం కావడంతో కళాశాలకు వచ్చింది. మధ్యలో ఇంటి వద్ద పనులు ఉన్నాయని చెప్పి వెళ్లింది. ఈ నెల 15 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని కళాశాలకు వచ్చింది.
- గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో కలకలం
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 25 : డిగ్రీ విద్యార్థిని కళాశాలలోని బాత్రూమ్లో ప్రసవించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని ఈ విద్యా సంవత్సరం జూలైలో డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్సీ) ప్రథమ సంవత్సరంలో చేరింది. ఆగస్టులో క్లాసులు ప్రారంభం కావడంతో కళాశాలకు వచ్చింది. మధ్యలో ఇంటి వద్ద పనులు ఉన్నాయని చెప్పి వెళ్లింది. ఈ నెల 15 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని కళాశాలకు వచ్చింది.
బుధవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి అక్కడే మగ శిశువును ప్రసవించి రూమ్‌కు వచ్చింది. బాత్రూమ్ వెళ్లిన విద్యార్థినులకు శిశువు కనపడగా భయంతో కేకలు వేశారు. ప్రిన్సిపాల్ వెళ్లి చూసే సరికి శిశువు మృతి చెంది ఉన్నది. వెంటనే సదరు విద్యార్థినిని ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని గర్భందాల్చి ప్రసవించే దశకు వచ్చినప్పటికీ అక్కడ విధులు నిర్వహించే అధికారులు, అధ్యాపకులు గమనించకపోవడం ఏమిటనే చర్చ కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధ్యాపకులు ఏం చేస్తున్నారని తెలంగాణ లా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ నారాయణ నాయక్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ విద్యార్థిని తరుచూ గైర్హాజరయ్యేది: ప్రిన్సిపాల్
సదరు విద్యార్థిని కాలేజీలో చేరినప్పటి నుంచి తరచూ గైర్హాజరయ్యేదని ప్రిన్సిపాల్ బిందు మాధురి తెలిపారు. జూలైలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు వచ్చి, తిరిగి సెప్టెంబర్‌లో రెండు రోజులు ఉండి వెళ్లిందని పేర్కొన్నారు. దసరా సెలవుల తర్వాత కళాశాలకు వచ్చిందని, ఇంటి వద్ద పనులు ఉన్నాయని మళ్లీ వెళ్లి పరీక్షలు రాయడానికి వచ్చినట్టు చెప్పారు. బుధవారం ఉదయం కడుపులో నొప్పి అని చెప్పి ప్రేయర్‌కు రాకుండా రూమ్‌లోనే ఉన్నదని, బాత్రూమ్కు వెళ్లి వచ్చి ఆరోగ్యం బాగా లేదని ఏఎన్ఎం దగ్గర టాబ్లెట్ తీసుకున్నట్టు తెలిపారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి: సత్యవతి రాథోడ్
కళాశాలలో విద్యార్థిని ప్రసవ ఘటనపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థిని ప్రసవించే దశకు వచ్చే వరకు ఎవరూ గుర్తించకపోవడంపై ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నదని అన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని స్టేట్ సెక్రటరీ, కలెక్టర్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

