ఆర్డీఎస్ రైతులను ఆదుకోవాలి: శ్రీనివాస్‌గౌడ్
కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటినిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని, వెంటనే టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేసి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 25 : కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటినిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని, వెంటనే టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేసి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
నీటి తడులు అందక 25 వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నదని, రెండు విడుతలు వదిలితే పంట చేతికి వస్తుందని చెప్పారు. తుంగభద్రలో తెలంగాణకు నాలుగు టీఎంసీల వాటా ఉన్నదని, అందులో ఒక్క టీఎంసీ వదిలినా పంటకు సరిపోతుందని తెలిపారు. తెలంగాణ రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తుంటే ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా నదీ జలాలు తరలించుకుపోతున్నదని ధ్వజమెత్తారు. టీబీ బోర్డులో రాష్ర్టానికి ప్రాతినిథ్యం లేదని.. సీఎం సొంత జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

