చంద్రబాబు సీట్లోనూ అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో సాధించిన విజయంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో రాత్రి 6 గంటల తర్వాత పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం నమోదు చేసిన వివరాల్లో 31 వేలకు పైగా ఓట్ల వ్యత్యాసం ఉన్నట్లు ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడైంది. ఈ అసమానతపై ఎన్నికల సంఘం విచారణ జరపలేదనే ఆరోపణలున్నాయి.
- ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలపై కొత్త వివాదం
- చిత్తూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో
- సాయంత్రం 6 తర్వాత నమోదైన ఓట్లలో వ్యత్యాసం
- లోక్‌సభ, అసెంబ్లీ లెక్కల్లో ఏకంగా 31 వేల ఓట్ల తేడా
- కుప్పం కూడా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోనే
- ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం
కుప్పం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో సాధించిన విజయంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో రాత్రి 6 గంటల తర్వాత పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం నమోదు చేసిన వివరాల్లో 31 వేలకు పైగా ఓట్ల వ్యత్యాసం ఉన్నట్లు ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడైంది. ఈ అసమానతపై ఎన్నికల సంఘం విచారణ జరపలేదనే ఆరోపణలున్నాయి.
ఎన్నికల సంఘం నివేదికల పరిశీలన
ఎన్నికల సంఘం వద్ద ఉన్న రిటర్నింగ్ అధికారుల అంతర్గత నివేదికలను ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశీలించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత రిటర్నింగ్ అధికారులు ఈ నివేదికలను ఈసీకి పంపిస్తారు. తొలిసారిగా ఈ నివేదికలను బయటి సంస్థ పరిశీలించినట్లు వెల్లడించింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి
2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు రెండు ఓట్లు వేయగా, పోలింగ్ నిర్వహణ బాధ్యత ఒకే ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరూ క్యూలో చేరకుండా ప్రిసైడింగ్ అధికారి ఓటర్లకు ప్రత్యేక స్లిప్పులు అందిస్తారు.
లోక్‌సభకు 56 వేలు.. అసెంబ్లీకి 24 వేలే!
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయం త్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న 56,067 మందికి స్లిప్పులు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అయితే అదే పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి కేవలం 24,596 మందే క్యూలో ఉన్నట్లు నమోదైంది. దీంతో రెండు లెక్కల మధ్య 31,471 ఓట్ల వ్యత్యాసం కనిపించింది. ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఉంది. ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.
విచారణ జరుగలేదంటూ ఆరోపణలు
ఒకే పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కలు సరిపోని చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై ఎన్నికల సంఘం పూర్తి భరోసా ఇవ్వలేదని పరిశోధనలో వెల్లడైంది. ఈ వ్యత్యాసంపై ఈసీ విచారణ చేపట్టలేదని తెలిపింది.
అర్ధరాత్రి వరకు పోలింగ్.. ప్రతిపక్షాల ఆరోపణలు
హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ అధికారిక ముగింపు సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా తెలిపారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడంపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు వ్యవస్థీకృతంగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

