ముప్పును తప్పించే పొటాషియం ఉప్పు
సాధారణ ఉప్పును పొటాషియం కలిపిన ఉప్పుతో భర్తీ చేయడం మంచిదని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తున్నది. పొటాషియం ఉప్పు వాడకంతో ఏటా సుమారు 30 లక్షల మరణాలను అరికట్టవచ్చని అంచనా వేసింది. సోడియం వినియోగం తగ్గి, పొటాషియం తీసుకోవడం పెరిగితే.. పలు ఆరోగ్యప్రయోజనాలు అందుతాయని అంటున్నది.
సాధారణ ఉప్పును పొటాషియం కలిపిన ఉప్పుతో భర్తీ చేయడం మంచిదని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తున్నది. పొటాషియం ఉప్పు వాడకంతో ఏటా సుమారు 30 లక్షల మరణాలను అరికట్టవచ్చని అంచనా వేసింది. సోడియం వినియోగం తగ్గి, పొటాషియం తీసుకోవడం పెరిగితే.. పలు ఆరోగ్యప్రయోజనాలు అందుతాయని అంటున్నది.
ఆస్ట్రేలియా వేదికగా పనిచేసే ‘ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫ్లోర్ గ్లోబల్ హెల్త్’ తాజాగా ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా.. మొత్తం 193 దేశాలలో సాధారణ ఉప్పు స్థానంలో పొటాషియం కలిపిన ఉప్పును వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ మార్పు చేస్తే.. ఏటా దాదాపు 30 లక్షల మరణాలను, కోటికిపైగా గుండె, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కేసులను నివారించవచ్చని ఈ మాడలింగ్ అధ్యయనం తేల్చింది. ఇక మన దేశం విషయానికి వస్తే.. ఏటా నాలుగు లక్షల మరణాలు, 15 లక్షలకు పైగా గుండె-కిడ్నీ వ్యాధి కేసులను నివారించే అవకాశం ఉన్నదట. కేవలం మందులపైనే ఆధారపడకుండా, ఈ సాధారణ ఆహారపు అలవాటు ద్వారా గుండె జబ్బుల భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని
అభిప్రాయపడుతున్నారు.
‘పొటాషియం’ ఎలా పనిచేస్తుంది?
సాధారణ ఉప్పులో ఉండే ‘సోడియం క్లోరైడ్’లోని కొంత భాగాన్ని ‘పొటాషియం క్లోరైడ్’తో భర్తీ చేసి, ఈ పొటాషియం ఉప్పును తయారు చేస్తారు. దీనిని అన్ని రకాల వంటల్లోనూ వాడుకోవచ్చు. ఫలితంగా, శరీరంలో సోడియం తగ్గి, పొటాషియం పెరుగుతుంది. సాధారణంగా.. శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటు రోజువారీ సోడియం వినియోగం 4.3 గ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన గరిష్ఠ పరిమితి (2 గ్రాములు) కంటే రెట్టింపు. అదే సమయంలో తగిన మోతాదులో పొటాషియం తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సగటు పొటాషియం వినియోగం రోజుకు 2.3 గ్రాములు మాత్రమే! ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు కనీసం 3.5 గ్రాములుగా ఉన్నది.
జాగ్రత్తలు తప్పనిసరి..
పొటాషియం ఉప్పుతో లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరిగిపోయే ‘హైపర్
కలీమియా’ అనే ముప్పు ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇక, కిడ్నీ వ్యాధిగ్రస్తుల శరీరంలో అదనపు పొటాషియం సరిగ్గా బయటికి వెళ్లలేదు. కొన్నిరకాల మందులు కూడా రక్తంలో పొటాషియం స్థాయులను పెంచుతాయి. కాబట్టి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకే వాడాలని అంటున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

