బిగ్ బాష్ లీగ్ లో వింతైన టైమ్డ్ ఔట్!
క్రికెట్లో బౌల్డ్, క్యాచ్, స్టంపౌట్, ఎల్బీ, రనౌట్ లాంటి ఔట్లు సహజం.
మెల్బోర్న్: క్రికెట్లో బౌల్డ్, క్యాచ్, స్టంపౌట్, ఎల్బీ, రనౌట్ లాంటి ఔట్లు సహజం. కానీ, విమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ మ్యాచ్‌లో ఓ వింతైన ఔట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రెనెగేడ్స్ స్టార్ డాటిన్ 75 సెకండ్లలోపు క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కాకపోవడంతో టైమ్డ్ అవుట్ నిబంధన కింద అవుటైంది.విమెన్స్, మెన్స్ బిగ్ బాష్ చరిత్రలో ఈ నిబంధన ప్రకారం అవుటైన తొలి క్రికెటర్‌గా డాటిన్ నిలిచింది.
దీంతో ఆమెను క్రీజుకు ఐదు మీటర్ల దూరంలో పక్కకు నిలబెట్టగా.. బ్రిస్బేన్ బౌలర్ సారా గ్లెన్ విసిరిన బంతి ఖాళీ వికెట్లను గిరాటేసింది. స్కోర్ కార్డులో డాటిన్ బౌల్డ్‌గా నమోదైంది. 2021-22లో బిగ్ బాష్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక నిబంధన ప్రకారం కొత్త బ్యాటర్ 75 సెకండ్లలోపు సిద్ధం కాకపోతే తొలి బంతి ఆడే అవకాశం ఉండదు. బ్యాటర్ దూరంగా నిలబడగా బౌలర్ నేరుగా వికెట్లపైకి బంతిని విసిరాలి. స్టంప్స్ పడితే ఔటైనట్లే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

