అవినీతి ప్రోత్సాహక విభాగం!
వ్యక్తి తనను కలిశారని, ఆయన తన సంభాషణల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు. డబ్బుల ఏర్పాట్లు చేయడానికి, డీఏ కేసు ముగించడానికి తనను పంపించాడని శ్రీకుమార్ చెప్పారని అంబేద్కర్ వివరించారు.
వ్యక్తి తనను కలిశారని, ఆయన తన సంభాషణల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ పేరును ప్రస్తావించారని పేర్కొన్నారు. డబ్బుల ఏర్పాట్లు చేయడానికి, డీఏ కేసు ముగించడానికి తనను పంపించాడని శ్రీకుమార్ చెప్పారని అంబేద్కర్ వివరించారు. ఆదాయానికి మించిన కేసుతోపాటు తనకు బినామీ పేర్కొన్న రాజేశ్‌పై కూడా చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.30 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత తాను జైలు నుంచి బయటకు రాగానే కేసు దర్యాప్తు చేస్తున్న సుధీర్ తనను కలిసి డీఏ కేసును మూసేయాలంటే రూ.15 లక్షలు, రాజేశ్‌పై చర్యలు తీసుకోకుండా ఉండడానికి మరో రూ.15 లక్షలు మొత్తం రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని వివరించారు. మరికొన్ని సందర్భాల్లో డబ్బులు రెడీ చేసుకో, కేసు క్లోజ్‌కు సిద్ధం చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సుధీర్ తనతో చెప్పారని, ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయని అంబేద్కర్ తన ఫిర్యాదులో తెలియజేశారు.
సుధీర్ డబ్బులు అడుగుతున్నాడని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన సైతం కాంప్రమైజ్ ధోరణిలో వెళ్లాలని, దర్యాప్తు అధికారి ఆదేశాల ప్రకారం ముందుకు సాగాలని సూచించడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇన్స్పెక్టర్ సుధీర్ తరుచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో మే 18న రూ.5 లక్షలు లంచం ఇచ్చానని అంబేద్కర్ వెల్లడించారు. ఈ వేధింపులపై జూన్ 20వ తేదీన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, అదే నెల 29న సెంట్రల్ జోన్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తన స్టేట్మెంట్ రికార్డు చేశారని వివరించారు. ఇదే విషయంపై ఆగస్టు 3న మరోసారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సుధీర్, ఆనంద్ ఇద్దరిపై తాను మరోసారి డీజీకి ఫిర్యాదు చేసినట్టు అంబేద్కర్ పేర్కొన్నారు. మొత్తం ఫోన్ సంభాషణలతోపాటు నేరుగా పిలిపించి కారులో తిప్పుతూ మాట్లాడిన వీడియోలు రికార్డు చేశానని, లంచం అడిగి తీసుకున్నారనడానికి తన దగ్గర అన్ని ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సాక్ష్యాలను ఏసీబీ డీజీకి అంబేద్కర్ ఇచ్చినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

