మంచి అలవాటుకు మధురమైన జోడీ!
మంచి అలవాట్లు చేసుకోవాలని అనుకుంటాం. కానీ వ్యాయామం చేయాలన్నా, పుస్తకం చదవాలన్నా, నడకకు వెళ్లాలన్నా ఏదో కారణంగా వాయిదా వేస్తుంటాం. అలాంటి పనుల్ని ఆసక్తికరంగా మార్చేందుకు ఒక చిన్న పద్ధతి ఉంది. అదే ‘టెంప్టేషన్ బండ్లింగ్'. మనకు ఇష్టమైన పనిని, చేయాల్సిన మంచి పనితో జతచేయడమే దీని అర్థం.
మంచి అలవాట్లు చేసుకోవాలని అనుకుంటాం. కానీ వ్యాయామం చేయాలన్నా, పుస్తకం చదవాలన్నా, నడకకు వెళ్లాలన్నా ఏదో కారణంగా వాయిదా వేస్తుంటాం. అలాంటి పనుల్ని ఆసక్తికరంగా మార్చేందుకు ఒక చిన్న పద్ధతి ఉంది. అదే ‘టెంప్టేషన్ బండ్లింగ్’. మనకు ఇష్టమైన పనిని, చేయాల్సిన మంచి పనితో జతచేయడమే దీని అర్థం. ఉదాహరణకు నడుస్తున్నప్పుడే ఇష్టమైన పాటలు వినడం, వ్యాయామం చేస్తూనే ఆసక్తికరమైన కథలు పెట్టుకోవడం, ఇంటి పనులు చేసేప్పుడు నచ్చిన చానెల్ ప్లే చేసుకోవడం… ఇలా అన్నమాట.
ఈ విషయంలో కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. వ్యాయామం చేసేప్పుడు ఆడిబుల్ బుక్స్ (వినగలిగే పుస్తకాలు) అందుబాటులో పెట్టిన వారు, అవి అందుబాటులో లేని వారితో పోలిస్తే జిమ్‌కి ఎక్కువ సార్లు వచ్చినట్టు ఇందులో తేలింది. అయితే ఈ పద్ధతి ఒక్కటే అలవాటును శాశ్వతం చేయదు. మనకు నచ్చిన చిన్న చిన్న ఆనందాలను మంచి అలవాట్లకు జతచేస్తే పనిని మొదలు పెట్టడం మాత్రం సులభమవుతుంది. తర్వాత కొనసాగించుకోవడం మన మీదే ఆధారపడుతుంది. మంచి అలవాటును భారంగా కాకుండా ఇష్టంగా మార్చుకోవడమే ఈ పద్ధతిలోని అసలైన చిట్కా!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

