సర్‌ను వెంటనే నిలిపివేయాలి
జార్ఖండ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. బుధవారం ప్రారంభమైన ప్రత్యేక సమావేశంలో ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిశోర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.
రాంచీ: జార్ఖండ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. బుధవారం ప్రారంభమైన ప్రత్యేక సమావేశంలో ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిశోర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాజకీయ పార్టీలతో సంప్రదించి, పారదర్శకతకు వీలుగా కొత్త ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) రూపొందించాలని తీర్మానంలో కోరారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా విధానపరమైన సంక్లిష్టతలు, సాంకేతిక లోపాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కిశోర్ పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని 2.21 కోట్ల మంది ఓటర్లలో 27 శాతం మందిని అనుమానితులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సమావేశం రాజకీయ కక్ష సాధింపు కోసమే నిర్వహించారని ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ఆరోపించారు.
తొలగించిన 43 లక్షల పేర్లలో 7.63 లక్షల మంది మరణించిన ఓటర్లు, 15.53 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, 4.38 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు, 14.50 లక్షల మంది ఆచూకీ లేనివారని వివరించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ యాదవ్ ఆరోపించారు. ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ ఎమ్మెల్యే సురేశ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

